బోయపాటి లెజెండ్ సినిమా హిట్ సమయంలో అనుకుంటాము..దేవీ దగ్గర నుంచి పిండేసా..లాగేసాఅంటూ స్టేట్ మెంట్ పడేసారు. దానిపై దేవి కాస్త అలిగాడని కూడా వినిపించంది. తనను ఎవరూ పిండక్కరలేదని, తాను ఎపుడూ మంచి మ్యూజిక్కే ఇస్తానని అన్నాడు కూడా. ఆ తరువాత డామేజ్ నివారణకు, బోయపాటి, దేవీ థియేటర్లలో పక్కపక్కన కూర్చుని, సెల్ఫీలు తీసుకుని పోస్టు చేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ పిండేసే వ్యవహారాన్ని దర్శక, రచయిత కోన వెంకట్, తన శంకరాభరణంలోకి తీసుకువచ్చాడు. సినిమాలో డైరక్టర్ వేషం వేసిన, కృష్ణ భగవాన్ చేత, పిండేస్తా..పిండేస్తా అనిపించాడు. మరి ఎప్పటి ఉదంతాన్నో ఇప్పుడు పైకి తీసి, కోన కెలకడం ఎందుకో?