ఆయన హైదరాబాద్ లెవల్లో ఒక ప్రముఖ రాజకీయ నేత. గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. అయితే ఇప్పుడు వాళ్ల పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. హడావుడి పూర్తిగా తగ్గించేశాడు. ఇప్పుడు ఆయన జంపింగ్ చేయబోతున్నాడనే అంశం గురించి కూడా బాగానే చర్చ జరుగుతోంది! ఈ ముదురు టెంకి నేత.. ఒక హీరోయిన్ తో ఏకంగా కాపురమే పెట్టేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పక్క రాష్ట్రం నుంచి తరలి వచ్చిన ఆ హీరోయిన్ కు అవార్డుల కొదవలేదు కానీ.. అవకాశాలు మాత్రం లేవు పాపం! ఆమె చాలా ప్రయత్నాలే చేసింది. కన్నడలో కూడా నటించి వచ్చింది కానీ.. అక్కడా వర్కవుట్ కాలేదు!
ఇలాంటి నేపథ్యంలో ఆమె కు వీరాభిమాని అయిన ఆ రాజకీయ నేత ఆమెను చేరదీయడానికి ముందుకు వచ్చాడు. తన అభిమానాని వివరించి.. ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి కాపురమే పెట్టేశారని వినికిడి. ఈ రాజకీయ నేత రాజకీయాలను పక్కన పెట్టేసి.. సొంతింటి వైపు వెళ్లడం కూడా మానేసి ఆ హీరోయిన్ తో చిన్నింటిలో సెటిలయినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా రాణించడానికి అవకాశం ఏమీ లేకపోవడంతో.. అప్పట్లో సంపాదించిన సొమ్ములతో ఇప్పుడు ఇలా ఎక్స్ ట్రా మారిటల్ లైఫ్ తో జీవితాన్ని ఆస్వాధిస్తున్నాడు.
మరి ప్రతిపక్షంలో ఉంటే రోడ్లపైకి వచ్చి పోరాడాలి కానీ.. చిన్నిళ్లలో కూర్చొని పోరాడితే ప్రయోజనం ఉండదు కదా..అందుకే ఇప్పుడు సొంత పార్టీ అధిష్టానానికి కూడా ఆయనపై ఆగ్రహాం వచ్చేసినట్టుగా టాక్. అయితే ఈ నేత మాత్రం పార్టీ ని, రాజకీయాలను ప్రస్తుతానికి లైట్ తీసుకొన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆస్వాధించే పనిలో ఉన్న ఆయన హీరోయిన్ కు ఆర్థికంగా కూడా అండగా నిలబడుతున్నట్టుగా తెలుస్తోంది.