Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ పై మరోసారి కన్నేసిన సల్మాన్

మహేష్ పై మరోసారి కన్నేసిన సల్మాన్

మహేష్ నటించిన పోకిరి సినిమాకు సల్మాన్ కు మధ్య చాలా అనుబంధం ఉంది. పోకిరి సినిమా రీమేక్ తోనే సల్మాన్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు కండలవీరుడు అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ కు పోకిరి సినిమానే బలమైన పునాది. అలాంటి సల్మాన్, మహేష్ నటించిన మరో సినిమాపై కన్నేశాడు.

అవును.. మహేష్ నటించిన మహర్షి సినిమాపై సల్మాన్ కన్నుపడింది. సల్మాన్ కు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పిన వ్యక్తి ప్రభుదేవా. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని, కచ్చితంగా హిట్ అవుతుందని సల్మాన్ కు చెప్పాడట. అందుకే ఈ సినిమాపై ఇప్పుడు సల్మాన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు.

సల్మాన్ చేస్తానంటే, ఎంత ఖర్చయినా ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తను తీసుకుంటానని ప్రకటించాడు నిర్మాత సాజిద్ నడియావాలా. ప్రస్తుతం సల్మాన్-సాజిద్ మధ్య ఈ సినిమా రీమేక్ పై చర్చలు సాగుతున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మహర్షి సినిమాను ఎవరు రీమేక్ చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే, ఈ సినిమా బాలీవుడ్ ను కూడా ఆకర్షించిందనే విషయం తాజా కథనాల వల్ల అర్థమౌతోంది. అటు కోలీవుడ్ నుంచి కూడా ఈ సినిమా రీమేక్ పై ఎంక్వయిరీలు మొదలయ్యాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?