Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ప్రాజెక్టు బహు చిత్రం

మహేష్ ప్రాజెక్టు బహు చిత్రం

ఎక్కడన్నా కథ ముందు అనుకుని, ఆపై దానికి తగిన నటులను తీసుకుని, టెక్నికల్ కాస్ట్ ఫిక్స్ చేసుకుని ఆప్పుడు షూటింగ్ కు వెళ్తారు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ లెక్కలు రివర్స్ లో వుంటాయి.  

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు హీరోయిన్ ఫిక్స్, కొందరు నటులు ఫిక్స్, టెక్నికల్ కాస్ట్ ఫిక్స్. ఆఖరికి షూటింగ్ డేట్ కూడా  ఫిక్స్ అని గ్యాసిప్ లు.  

గమ్మత్తేమిటంటే అసలు కథ మాత్రం ఇంకా రెడీ కాలేదన్నది అసలు సిసలు గ్యాసిప్. మహేష్ బాబు-త్రివిక్రమ్ కలిసి ఏ విధమైన సినిమా చేయాలన్నది డిసైడ్ అయ్యారు. అంతవరకు వాస్తవం. 

ఫుల్ లెంగ్త్ నెరేషన్ ఇవ్వడం అన్నది డ్యూ. అది వాస్తవం. ఇటీవల గోవా వెళ్లి ఇవ్వాలనుకున్నారో, డిస్కస్ చేయాలని అనుకున్నారు అంత వరకు ఓకె. 

మహేష్ బాబు ఫ్రీ కావాలి. త్రివిక్రమ్ నెరేషన్ ఇవ్వాలి. అది ఓకె కావాలి. అప్పుడు షెడ్యూలు సంగతి. ప్రస్తుతానికి స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ డేట్ లు బ్లాక్ చేసి వుంచారు. షూటింగ్ ఎప్పుడు వుండొచ్చన్నది మహేష్ బాబు డెసిషన్ మీద ఆధారపడి వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?