ఒక వైపు కరోనా మూడవ దశ భయపెడుతోంది. కేసులు ప్రస్తుతానికి తగ్గినట్లుగా ఉన్నా కూడా ఎపుడు ఎలా ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియడంలేదు. ఇపుడు పులి మీద పుట్రలా డెంగ్యూ వ్యాధి కూడా వచ్చి మీద విరుచుకుపడుతోంది.
విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇటీవల డెంగ్యూ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ రూరల్ జిల్లా ఏజెన్సీలో అయితే రోజుకు యాభై నుంచి వంద దాకా కేసులు వస్తున్నాయి.
ఇక ఏజెన్సీ అయితే వర్షాకాలం సీజన్ లో విష జ్వరాలు ప్రతీ ఏటా రావడం కామన్. దానితో పాటు ఈ ఏడాది డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. దీని మీద వైధ్య అధికారులు దృష్టి సారిస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున డెంగ్యూ కేసులు రావడంతో వైద్య సేవలు సరిపడా అందడంలేదన్న ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీలో డెంగ్యూ బారిన పడి ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఇటీవల మరణించడం డెంగ్యూ విసిరిన పంజా ఎలాంటిదో చెబుతోంది.
మరో వైపు జ్వరాలు అంటే అది డెంగ్యూనా, లేక కరోనా అన్నది అర్ధం కాక చాలా మంది కంగారు పడుతున్నారు. మొత్తానికి కరోనా కొంత తగ్గింది అనుకుంటే డెంగ్యూ డేంజర్ ఏంటి అంటూ విశాఖ వణుకుతోంది.