Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అటు మహేష్, ఇటు సుక్కూ.. ఎవర్నీ వదలరట!

అటు మహేష్, ఇటు సుక్కూ.. ఎవర్నీ వదలరట!

మహేష్-సుకుమార్ కాంబోలో సినిమా సెట్ అయింది. అటు మహేష్ అభిమానులు, ఇటు సుక్కూ అభిమానులు కూడా హ్యాపీ. వన్-నేనొక్కడినే ఫ్లాప్ ను మరిపించేలా మరో కొత్త కథ ప్లాన్ చేస్తున్నట్టు సుకుమార్ ప్రకటించాడు. అయితే సేమ్ టైం అఖిల్ ను కూడా వదిలేది లేదంటున్నాడు సుకుమార్.

మహేష్ తో మూవీ ఓకే కాకముందే అఖిల్ తోనే సినిమా ప్లాన్ చేశాడు సుకుమార్. ఒకవేళ మహేష్ తో ప్రాజెక్టు కనుక డిలే అయితే, ఆ గ్యాప్ లో అఖిల్ తో మూవీ చేసేద్దామనుకున్నాడు. కానీ మహేష్ సినిమా పక్కా అయింది. దీంతో అఖిల్ సైడైపోయాడు. అయితే అఖిల్ తో మాత్రం మూవీ కచ్చితంగా ఉంటుందంటున్నాడు సుకుమార్.

అటు మహేష్ ది కూడా ఇలాంటి పరిస్థితే. సుకుమార్ తో సినిమా కంటే ముందు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డితో మూవీ ప్లాన్ చేశాడు. కానీ సడెన్ గా సుకుమార్ మూవీ ఓకే అవ్వడంతో సందీప్ రెడ్డి సైడైపోయాడు. అయితే సందీప్ తో కచ్చితంగా సినిమా ఉంటుందంటున్నాడు మహేష్. నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ పార్టీలో కూడా సందీప్ రెడ్డిని వదల్లేదు మహేష్.

సో.. అటు అఖిల్ తో సుకుమార్ సినిమా, ఇటు సందీప్ రెడ్డితో మహేష్ సినిమా ప్రస్తుతానికైతే లేవు. తమతమ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రాజెక్టులు సెట్స్ పైకి వస్తాయేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?