Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేశ్.. తన బావకు యాడ్స్ ను కూడా ఇప్పిస్తున్నాడా..!

మహేశ్.. తన బావకు యాడ్స్ ను కూడా ఇప్పిస్తున్నాడా..!

కృష్ణ అల్లుడు, మహేశ్ కు బావ అనే హోదాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. ఇలాంటి నేపథ్యంతోనే ఆయనకు అవకాశాలు లభించాయి.. వాటిల్లో కొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించుకోవడంతో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. సుధీర్ బాబుతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలే ముందుకొస్తున్నారు. సుధీర్ సినిమాను మహేశ్ బాబు ప్రమోట్ చేస్తాడని..  దీంతో కావాల్సినంత ప్రచారం వస్తుందని.. వేరే చోటా హీరోలతో చేయడాని కన్నా..సుధీర్ తో సినిమా చేస్తే ఆ అడ్వాంటేజీ ఉంటుందని దీంతో నిర్మాతలు ఆయనను ఎంచుకుంటున్నారని ఇండస్ట్రీలోని వ్యక్తులు.

ఈ విధంగా సుధీర్ కు మహేశ్ బాబు పెద్ద అడ్వాంటేజీ గామారాడు. మహేశ్ కు ఇండస్ట్రీపై ఉన్న పట్టు, ఆయనకు ఉన్న అభిమాన బలంగా సుధీర్ కు ప్లస్ పాయింటవుతోంది. కేవలం సినిమాల విషయంలోనే కాదు.. యాడ్స్ విషయంలో కూడా సుధర్ కు మహేశ్ బాబు పెద్ద ప్లస్ పాయింటవుతున్నాడని వినికిడి. ఇప్పుడు సుధీర్ బాబుకు ఒక యాడ్ లో కూడా కనిపిస్తున్నాడు. అది కూడా ఒక మల్టీనేషనల్ చాక్లెట్ కంపెనీ యాడ్ లో దర్శనమిస్తున్నాడు. 

స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల స్థాయిలో సుధీర్ ఆ యాడ్ ను సొంతం చేసుకోవడం వెనుక మహేశ్ ప్రభావం ఉందని సమాచారం.  ఎలాగూ యాడ్ మేకర్స్ కు ఇప్పుడు మహేశ్ చాలా ఇష్టుడు.  ఇండియన్ మార్కెట్ లో మహేశ్ బాబు ప్రమోషన్ కు చాలా విలువే ఉంది. కాబట్టి.. మహేశ్ రెఫరెన్స్ తో సుధీర్ కు కూడా మల్టీ నేషనల్ కంపెనీల యాడ్స్ దక్కి ఉండవచ్చు. మొత్తానికి బావను హీరోని నిలబెట్టడానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడమే గాక.. ఆయననే స్వయంగా బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టడానికి మహేశ్ చాలా కృషినే చేస్తున్నట్టున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?