మహేష్ వస్తున్నాడు

సుధీర్ బాబు నటిస్తూ, స్వయంగా నిర్మించిన సినిమా 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ నే వచ్చింది. మరీ కలెక్షన్లు కుమ్మేయలేదు కానీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వున్నాయో, అదే…

సుధీర్ బాబు నటిస్తూ, స్వయంగా నిర్మించిన సినిమా 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ నే వచ్చింది. మరీ కలెక్షన్లు కుమ్మేయలేదు కానీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వున్నాయో, అదే రేంజ్ లో వీక్ లాంగ్ స్టడీగా వున్నాయి. అది సినిమాకు ఓ పాజిటివ్ థింగ్. అయితే వీటిని మరింత పెంచాలని, మలి వారం కూడా స్టడీగా వుంచాలన్నది నిర్మాత కమ్ హీరో సుధీర్ బాబు ప్లాన్.

అందుకే ఫస్ట్ వీక్ కాగానే ఓ మాంచి సక్సెస్ మీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సుధీర్ బాబు సినిమాలకు విడుదల ముందుగా మహేష్ బాబు రావడం కామన్. కానీ నన్ను దోచుకుందువటే సినిమాకు మహేష్ బాబు రాలేదు. కానీ ఇప్పుడు సక్సెస్ మీట్ కు మాత్రం మహేష్ వస్తాడని తెలుస్తోంది.

మహేష్ వస్తే, ఆ బజ్ వేరుగా వుంటుంది. సినిమాకు కాస్త ఎలాగూ పాజిటివ్ నార్మల్ టాక్ వుంది. అందువల్ల మహేష్ కనుక వచ్చి, సక్సెస్ మీట్ జరిగితే సెకండ్ వీక్ కూడా స్టడీగా వుంటుందని సుధీర్ బాబు ఆశపడుతున్నాడు.

ఇదిలా వుంటే నన్ను దోచుకుందువటే నిర్మాత కమ్ హీరో సుధీర్ బాబుకు ఏ మేరకు ప్లస్ అయిందన్న సంగతి పక్కన పెడితే, డైరక్టర్ నాయుడు కు హీరోయిన్ నభాకు మాత్రం మాంచి ఎంక్వయిరీలు, అవకాశాలు తెచ్చి పెడుతోంది. డైరక్టర్ నాయుడుకు మూడు నాలుగు మాంచి ఆఫర్లు వచ్చాయి. నభాకు కూడా అదే విధంగా వుంది పరిస్థితి.

సినిమా రివ్యూ: నన్ను దోచుకుందువటే