మారుతి సినిమా ఇంకోటి మిగిలింది

మారుతి సినిమాలు రెండు రకములు. ఒకటి ఆయన దర్శకత్వం వహించేవి. రెండు ఆయన కాన్సెప్ట్ లు, బ్యానర్లు ఇచ్చి తయారుచేయించేవి. చిత్రమేమిటంటే, ఇలా బ్యానరు ఇచ్చి, కాన్సెప్ట్ ఇచ్చి తయారుచేయించిన, 'మేడిన్ మారుతి ఆఫీస్'…

మారుతి సినిమాలు రెండు రకములు. ఒకటి ఆయన దర్శకత్వం వహించేవి. రెండు ఆయన కాన్సెప్ట్ లు, బ్యానర్లు ఇచ్చి తయారుచేయించేవి. చిత్రమేమిటంటే, ఇలా బ్యానరు ఇచ్చి, కాన్సెప్ట్ ఇచ్చి తయారుచేయించిన, 'మేడిన్ మారుతి ఆఫీస్' సినిమాలు అన్నీ చాలావరకు పేలని టపాకాయలే. దాదాపు అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే.

ఇప్పుడు అలా మారుతి ఆఫీస్ లో తయారైన ఇంకో సినిమా మిగిలిపోయింది. భలే మంచి చౌకబేరమ్ అనే ఆ సినిమాను మరోవారంలో వదుల్తున్నారు. చిత్రమేమిటంటే, ఈ సినిమాకు మారుతి టాకీస్ బ్యానర్ తగిలించకపోవడం. కేవలం అన్నీ పేర్లలో ఒకటిగా కాన్సెప్ట్ మారుతి అని సింపుల్ గా వేసేసారు.

దాదాపు మూడేళ్లుగా ఎప్పటికప్పుడు ఇలాంటి 'చిన్న చిన్న చిల్లర' వ్యవహారాలకు స్వస్తి చెబుతా అంటూ వస్తున్నారు మారుతి. కానీ అవి అలా సీరియల్ ఎపిసోడ్ ల మాదిరిగా వస్తూనే వున్నాయి. ఇప్పుడు దీని తరువాత ఇక వుండకపోవచ్చని తెలుస్తోంది. నోటా వంటి మాంచి బజ్, స్పీడ్ వున్న సినిమాకు పోటీగా భలే మంచి చౌకబేరమ్ విడుదలవుతోంది. నోటాతో పోల్చుకుంటే, ఈ సినిమా నిజంగా చౌకబేరమే అనుకోవాలి.