నాగ్ మార్క్ రిమార్క్

విడుదలకు రెండు మూడురోజుల ముందు సినిమా చూపిస్తే, ఏం చెప్పగలం? ఏ చేయగలం? అంటూ ఓ ఝలక్ లాంటి మాట వదిలాడు హీరో నాగార్జున. దేవదాస్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈమాట అనడం…

విడుదలకు రెండు మూడురోజుల ముందు సినిమా చూపిస్తే, ఏం చెప్పగలం? ఏ చేయగలం? అంటూ ఓ ఝలక్ లాంటి మాట వదిలాడు హీరో నాగార్జున. దేవదాస్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈమాట అనడం ద్వారా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను నీరసపర్చడం మాత్రమేకాదు, సినిమా బజ్ ను కూడా కాస్త వెనక్కు లాగాడు.

అయితే సెన్సారు తరువాత సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత ఫస్ట్ హాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. నాలుగైదు నిమిషాలు నిడివి కట్ చేసినట్లు వినికిడి. అవన్నీ చేసాక, ఈరోజు నాగ్ ఆయన ఫ్యామిలీ మెంబర్లు, సన్నిహితులు డజనున్నర మంది దేవదాస్ సినిమా చూసారు.

అంతకు ముందే అశ్వనీదత్ సన్నిహితులు, నాగ్, నాని అంతా సెకండాఫ్ కు యునానిమస్ గా ఓటేసారు. చెన్నయ్ ఎవిఎమ్ లో ఎప్పుడయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు ఫస్టాఫ్ కు చేసారో, అది కూడా పాస్ అయిపోయింది.

ఇప్పుడు ఈ ఫైనల్ కాపీని చూసిన నాగ్ ట్వీట్ చేసి, సక్సెస్ జేబులో వేసుకున్నా, హ్యాపీగా వెకేషన్ కు వెళుతున్నా అని ట్వీట్ చేసి, నష్టపరిహారం ఇచ్చేసాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు.