Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ కు గ్యాప్ తప్పదా?

మహేష్ కు గ్యాప్ తప్పదా?

చకచకా సినిమాలు చేయాలనుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరోసారి కాస్త గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రియల్ వరకు మహేష్ బాబు షూటింగ్ కు దూరంగా వుండాల్సి వుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా వర్క్ నవంబర్ కే పూర్తయిపోతుందని తెలుస్తోంది.

కానీ ఆ తరువాత సినిమా ప్రారంభం కావడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. పరుశురామ్, వంశీ పైడిపల్లిల పేర్లు వినిపిస్తున్నా, రెండోపేరు వైపే మహేష్ మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల నుంచే నిర్మాత దిల్ రాజు కొత్త సినిమా కోసం ఆఫీస్ కార్యక్రమాలు ప్రత్యేకంగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇక వంశీ పైడిపల్లి అధికారికంగా మహేష్ సినిమా పని మీద వుంటారన్నమాట.

మరి పరుశురామ్ పరిస్థితి ఏమిటి అన్నది తెలియాల్సివుంది. భీమిలిలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని తిరిగివచ్చిన పరుశురామ్ ఏం చేస్తారో చూడాలి. ఇదిలావుంటే మహేష్ కు చెప్పిన స్క్రిప్ట్ నే పరుశురామ్ కొన్నాళ్ల కిందట ఎన్టీఆర్ కు కూడా చెప్పినట్లు వినిపిస్తోంది. మరి అక్కడ రెస్పాన్స్ కూడా అంత పాజిటివ్ గా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు ఓ నాలుగు అయిదు నెలలు గ్యాప్ తప్పేలా లేదని తెలుస్తోంది.

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?