Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహి సెటైర్ ఎవరి మీద?

మహి సెటైర్ ఎవరి మీద?

డైరక్టర్ మహీ అంటే కేరాఫ్ వైకాపా అనడం కామన్. ఎందుకంటే వైఎస్.బయోపిక్ యాత్ర సినిమా అందించింది అతనేగా. అలాగే వైకాపా కు ప్రకటనలు ఎక్సెట్రా అందించారు. అందువల్ల ఆయన పొలిటికల్ సెటైర్ తీస్తున్నారు అంటే కచ్చితంగా ఎవరి మీద సెటైర్ అన్న అనుమానం కలగడం సహజం. 

సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్ తో పాటు పలువురు కమెడియన్లు కూడా నటిస్తున్నారు. వీరందరితో ఎవరి మీద సెటైర్లు వేయిస్తారు మహీ అన్నది పాయింట్. 

తెలంగాణ రాజకీయాలు అయితే టచ్ చేయరు. ఆంధ్రలో మహి అధికారపక్షం వైపు వున్నారు. అందువల్ల ఈ సెటైర్లు అన్నీ కేవలం రాజకీయాల మీద పడతాయా? లేక చంద్రబాబు మీద ఆయన పార్టీ మీద పడతాయా అన్నది చూడాలి. 

ప్రస్తుతం యూవి సంస్థ మూడు చిన్న సినిమాలు వరుసగా ప్లాన్ చేసింది. వాటిలో రెండు రెడీ అయ్యాయి. మహి డైరక్ట్ చేసేది మాత్రం ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?