Advertisement

Advertisement


Home > Movies - Movie News

సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందు..!

సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందు..!

ప్రతినిధి-2 పూర్తిగా రెడీ అయింది. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆ సినిమాను వాయిదా వేశారు. కారణాలేంటనేది మాత్రం చెప్పలేదు. "చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం, కానీ కంగారు పడాల్సిన పని లేదు. త్వరలోనే మీకు దగ్గర్లో ఉన్న థియేటర్లలో ప్రత్యక్షమౌతాం." అని మాత్రమే ప్రకటించి, అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త తేదీతో ముందుకొచ్చింది. ప్రతినిధి-2 సినిమాను మే 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అంటే, తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సరిగ్గా 3 రోజుల ముందన్నమాట. బహుశా, వాళ్లు కోరుకుంటోంది కూడా ఇదేనేమో.

నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి-2. యాంకర్ కమ్ జర్నలిస్ట్ మూర్తి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రస్తుత రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని యూనిట్ చెబుతున్నప్పటికీ, జనాలకు మాత్రం కొన్ని అనుమానాలున్నాయి. ఎందుకంటే, హీరో-దర్శకుడు ఇద్దరూ టీడీపీకి చెందిన మనుషులే కాబట్టి.

ఈ సినిమా కోసం హీరో-దర్శకుడు ఇద్దరూ గట్టిగా ప్రచారం చేశారు. టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అంతలోనే సినిమా వాయిదా పడింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల టైమ్ లో థియేటర్లలోకి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?