డిజాస్టర్లు అయితేనేం, సాదా సీదా సినిమాలు అయితేనేం, దాదాపు ఏడెనిమిది సినిమాలు నిరాశ పరిచాయి. అలాంటి టైమ్ లో వచ్చింది మజిలీ సినిమా. ఆ సినిమా మీద చైతూ కోసం భార్య సమంత ఎంత కేర్ తీసుకుందన్నది ఇండస్ట్రీ జనాలకు తెలుసు. ఆమెనే స్వయంగా పలు ఇంటర్వూల్లో చెప్పారు. విడుదల మందురోజు రాత్రి తాను నిద్రపోలేదు. టెన్షన్ తో ఫోన్ లు చేస్తూ, నిర్మాతను నిద్రపోనివ్వలేదని. మొత్తంమీద సమంత టెన్షన్ తీరింది.
మజిలీ సినిమా కలెక్షన్ల పరంగా మంచి హిట్ అయింది. ముఫైకోట్ల షేర్ ను దాటింది. 11 రోజులకు వరల్డ్ వైడ్ గా ముఫై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సినిమాను వరల్డ్ వైడ్ గా 20 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. నైజాం నుంచి లాభాల్లో వాటా నిర్మాతకు అందుతుంది కూడా. సినిమాకు 21 కోట్ల వరకు అయిందని బోగట్టా. విడుదల నాటికే టేబుల్ ప్రాఫిట్ సినిమా. విడుదలయ్యాక కూడా లాభాలు పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికి 24 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి.
11 రోజులకు మజిలీ కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం……………………10 కోట్లు
సీడెడ్…………………….3.31 కోట్లు
ఉత్తరాంధ్ర………………3.75 కోట్లు
ఈస్ట్……………………….1.51 కోట్లు
వెస్ట్………………………..1.17 కోట్లు
కృష్ణ……………………….1.68 కోట్లు
గుంటూరు………………..1.92 కోట్లు
నెల్లూరు…………………...0.72 కోట్లు
రెస్టాఫ్ ఇండియా………..2.95 కోట్లు
ఓవర్ సీస్…………………3.05 కోట్లు