cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ మా బరిలో ప్రకాష్ రాజ్?

మళ్లీ మా బరిలో ప్రకాష్ రాజ్?

కొన్ని నెలల క్రితం మా ఎన్నికలు ఎంత గడబిడ జరిగాయో అందిరకీ తెలిసిందే. మంచు ఫ్యామిలీకి, ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నడుమ హోరా హోరీ పోరు నడిచింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఆ తరువాత ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. 

మంచు విష్ణు కూడా ఆరంభంలో కాస్త హడావుడి చేసినా, తరువాత ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా కార్యక్రమాల హడావుడి అయితే ఏమీ లేదు. 

అయితే మళ్లీ మా ఎన్నికలు (ఇప్పట్లో కాదు) వస్తే ప్రకాష్ రాజ్ బరిలో వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ప్రకాష్ రాజ్ ఇదే ఆలోచనతో వున్నారని బోగట్టా. అందుకే  ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కానీ, ఆయన ప్యానల్ కానీ ఏమీ మాట్లాడకుండా సైలంట్ గా వున్నారు.  

మా బిల్డింగ్ గురించి కానీ, మిగిలిన వ్యవహారాల గురించి కానీ అస్సలు డిమాండ్ చేయడం లేదు. గుర్తు చేయడం లేదు. కాలం ఇలా గడచిపోతే హామీలు నెరవేర్చలేదనే ప్రచారంలో ఎన్నికల్లో దిగాలన్నది ప్రకాష్ రాజ్ ఆలోచన అని తెలుస్తోంది.   

వాస్తవానికి మంచు విష్ణు కూడా మా భవంతి గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. గెలిచిన వెంటనే స్వంత డబ్బులతో భవనం నిర్మిస్తా అని ఆయన అప్పట్లో ప్రకటించారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయోమో తెలియదు. 

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?