Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీ నేతలపై హనీ ట్రాప్.. ఫస్ట్ టార్గెట్ అంబటి

వైసీపీ నేతలపై హనీ ట్రాప్.. ఫస్ట్ టార్గెట్ అంబటి

మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత అంబటి కాస్త తగ్గుతారేమో అనుకున్నారంతా. కానీ ఆయన తగ్గేదే లే అంటూ పుష్ప డైలాగులు చెబుతున్నారు. చెప్పడమే కాదు, అమలు చేస్తున్నారు కూడా. 

గంట, అరగంట అంటే ఊరుకుంటానా అంటూ.. అసెంబ్లీలో చంద్రబాబు ఏడుపుకి కారణమైన డైలాగుల్ని మళ్లీ ట్విట్టర్లో పెట్టారు. దీంతో ప్రతిపక్షం కూడా రెచ్చిపోతోంది. ఎవరో యూట్యూబ్ ఛానెల్ మహిళా యాంకర్ తో మంత్రిగారి సంభాషణ లీక్ చేయమంటారా అంటూ అయ్యన్న లీకులు వదులుతున్నారు.

చూస్తుంటే, వైసీపీ నేతలపై హనీ ట్రాప్ మొదలైందని అర్థమవుతోంది. ముందుగా అంబటిని టార్గెట్ చేసినట్టున్నారు. ఇలాంటి లీకులు, రీమిక్స్ లు, పక్కా ప్రిపరేషన్ తో జరిగే వ్యవహారాలను పోలీసులు కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టరని, కూపీ లాగి కూసాలు కదిలిస్తారని పచ్చ బ్యాచ్ తెలుసుకుంటే మంచిది.

అప్పట్లో అవంతి, అంబటి ఫోన్ వాయిస్ లు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. ఆ వాయిస్ లు తమవి కావని అన్నారే కానీ, అసలు అలాంటి మెసేజ్ లు సర్క్యులేట్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇద్దరూ ఫిర్యాదులు చేయలేదు. దీంతో జనం కూడా ఈ వ్యవహారంలో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తెలుసుకోలేకపోయారు. 

ఇప్పుడు మళ్లీ అంబటి రాంబాబుతో అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియాలో సరసాలు మొదలు పెట్టారు. ఎవరో యూట్యూబ్ ఛానెల్ యాంకర్ వ్యవహారం బయటపెడతానంటూ లీకులు వదులుతున్నారు. అంటే అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. కావాలనే ఇదంతా చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది.

నిజంగానే అధికార పార్టీ నేతలు తప్పు చేసి ఉంటే అయ్యన్న పాత్రుడు ఆ ఆడియోనో, వాట్సప్ చాటింగో ఎప్పుడో బయటపెట్టేవారు. అంతే కాని, ఇలా బెదిరించాలని చూస్తే అది ముమ్మాటికీ బ్లాక్ మెయిల్ అవుతుంది. కచ్చితంగా అలాంటివాటిపై అంబటి పోలీస్ కంప్లయింట్ చేయాల్సిందే. నిజానిజాలు నిగ్గుతేలితేనే.. పార్టీపై మచ్చపడకుండా ఉంటుంది.

ఒకవేళ టీడీపీ బ్యాచ్ ఇదే పనిగా అందర్నీ బ్లాక్ మెయిల్ చేయడానికి హనీట్రాప్ ఉపయోగిస్తుందని తెలిస్తే మాత్రం కచ్చితంగా దానికి సహకరించినవాళ్లంతా ఊచలు లెక్కబెట్టాల్సిందే. రాజకీయాల్లో నేతల పరువు తీయడానికి ఇదో రకం మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల వేళ.. ఇలాంటి గిమ్మిక్కులకు బలవకుండా ఉండాలంటే, వైసీపీ నేతలు ఇప్పట్నుంచే అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

నేతల పనితీరుని విమర్శించేంత సీన్ లేకపోవడంతో ఇలా వ్యక్తిగత విషయాల్లోకి తలదూరుస్తూ.. అనుకూల మీడియాతో ఆడిపోసుకుంటున్నారు టీడీపీ నేతలు. సోషల్ మీడియా సహాయంతో మరింత రెచ్చిపోతున్నారు. పొరపాటున తప్పుడు రాతలపై, వ్యాఖ్యలపై పోలీసులు విచారణ మొదలు పెడితే.. వన్ సైడ్ గా తమని ఇబ్బంది పెడుతున్నారంటూ మరో ఏడుపు.

వ్యక్తిగత జీవితాలను బజారున పెట్టుకునే ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఏపీలో జోరుగా సాగడం నిజంగా విచారకరం, ఆందోళనకరం. దీనికి టీడీపీ బీజం వేయడం దారుణం. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా