మళ్లీ మొదటికి వచ్చిన మైత్రీ-సితార వివాదం

సమసిపోయింది అనుకుంటున్న మైత్రీ మూవీస్-హారిక హాసిని వివాదం మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు విడుదల సంక్షోభం పరిష్కారం అయినట్లే, అయి, మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎంతవరకు…

సమసిపోయింది అనుకుంటున్న మైత్రీ మూవీస్-హారిక హాసిని వివాదం మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు విడుదల సంక్షోభం పరిష్కారం అయినట్లే, అయి, మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే, విడుదల ఎవరిదో తేలేవరకు వాళ్లు టీజర్ వేయద్దు, మేమూ టీజర్ వేయము అని ఒకరికి ఒకరు అనేంత వరకు వచ్చిందని తెలుస్తోంది. మొన్నటికి మొన్న నాగ్ నేరుగా మైత్రీ మూవీస్ నవీన్, డైరక్టర్ చందుతో సమావేశమై మాట్లాడారు.

అప్పటిదాకా అయిన సినిమా అంతా చూసారు. ఇంకేం మిగిలివుంది? మార్పులు ఏమిటి కనుగొన్నాడు. గో ఎహెడ్ అన్నారు. డేట్ విషయంలో శైలజారెడ్డి నిర్మాతల సమస్యలు కూడా చూడమని చెప్పినట్లు బోగట్టా. అలాగే సినిమా ఫినిష్ అయిన తరువాత డిసైడ్ చేద్దాం అవసరం అయితే అని కూడా అన్నట్లు వినికిడి. దాంతో శైలజారెడ్డి అల్లుడు యూనిట్ చకచకా తమ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ప్రకటించింది. టీజర్ విడుదలకు కూడా సన్నాహాలు ప్రారంభించింది.

కానీ ఇప్పుడు ఆరునూరైనా సరే, తాము ఆగస్టులోనే వస్తామని, ఆగస్టు 17 లేదా 24కు గ్యారంటీ అని  మైత్రీ జనాలు అంటున్నాట్లు వినిపిస్తోంది. రంగస్థలం విడుదల టైమ్ లో కూడా హారిక జనాలు ఇలాగే చేసారని, సంక్రాంతికి తాము ముందుగా డేట్ ఇస్తే, అజ్ఞాతవాసిని తీసుకువచ్చి వేసారని, దాంతో తాము వెనక్కు వెళ్లిన సంగతిని గుర్తుచేస్తున్నారట. అందువల్ల ఆగస్టును వదిలేది లేదు అంటున్నారట. అప్పుడు మారు మాట్లాడకుండా వెనక్కు వెళ్లిపోయామని అంటున్నారట.

తామూ ఆగస్టు వదలమని, అవసరమైతే సవ్యసాచి ఆగస్టు 31న వచ్చినా, తాము కూడా అదేరోజు విడుదల చేస్తామని సితార ఎంటర్ టైన్ మెంట్ జనాలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇక తానేం చేయలేనని హీరో చైతన్య చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. మైత్రీ జనాలు ఫీల్ కాకుండా, శైలజారెడ్డి అల్లుడు ఓ పాటను మాత్రం ఈ నెలలో చేయకుండా ఆగస్టుకు బకాయి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పాట మినహా మిగిలినదంతా పూర్తయినట్లే.

అసలు సమస్య ఇదీ

ఇద్దరు ఆగస్టు అని పట్టుపట్టడానికి కారణం, సెప్టెంబర్ లో నాగార్జున సినిమా వుంది. తన సినిమాకు సినిమాకు నెలగ్యాప్ ఇవ్వమని చైతన్య అడుగుతున్నారు. అక్టోబర్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వుంది. అందువల్ల ఎవ్వరు వెనక్కు వెళ్లినా మళ్లీ నవంబర్ వరకు డేట్ దొరకదు. అప్పటికి బజ్ జారిపోయే అవకాశం వుంది.

ముగ్గురు మళ్లీ సిటింగ్

ఇదిలావుంటే చైతన్యతో నేరుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ జనాలు, మైత్రీజనాలు కూర్చోవాలని డిసైడ్ అయ్యారు. తను అటు ఇటు చెప్పలేకపోతున్నానని, ఇద్దరితో కలిసి ఒకేసారి మీటింగ్ పెడతానని అప్పుడు తేలుద్దామని చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో వ్యవహారం అక్కడ ఆగింది.