Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ రంగస్థలం పెయిర్?

మళ్లీ రంగస్థలం పెయిర్?

రంగస్థలంలో సమంత-రామ్ చరణ్ జోడీ ఎంత క్లిక్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.అదే పెయిర్ మళ్లీ రిపీట్ కావడానికి చాన్స్ కనిపిస్తోంది. కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ కూడా నలబై నిమషాల పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్ర కు హీరోయిన్ కావాలి.

సినిమాకు మాగ్జిమమ్ బజ్ తీసుకురావడానికి బాలీవుడ్ హీరోయిన్ ఎవరినైనా తేవాలనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఓ పాట, ఓ ఫైటు వుంటాయి. అంటే హీరోయిన్ కు ఒక్క సాంగ్ నే వుంటుందన్న మాట. అందువల్ల ఎవరు ఊ అంటారో చూడాలి. 

ఒకవేళ అలా ఎవరు అయినా సెట్ కాకపోతే, సమంత ను తీసుకోవాలనే ఆప్షన్ ను కూడా రిజర్వ్ లో వుంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒకటి రెండు వేరే పేర్లు పరిశీలనలో వున్నాయి. 

కానీ అటు తిరిగి ఇటు తిరిగి సమంత దగ్గరకే వచ్చి ఆగే అవకాశం వుందని వినిపిస్తోంది. అదే జరిగితే రంగస్థలం పెయిర్ మరోసారి తెరమీద కనువిందు చేస్తుందన్నమాట.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?