ఊ అంటే చాలు టాలీవుడ్ కు థియేటర్ల కొరత వచ్చి పడుతుంది. ఇప్పుడు మళ్లీ అదే సమస్య. నేడు (31న) విడుదలవుతున్నవాటికే థియేటర్లు దొరకలేదు. నగరాల్లో బాహుబలి ఇంకా కూర్చుంది. అలాగే భజరంగ్ భాయిజాన్ కూడా వుండనే వుంది. ఇక మూమూలు సెంటర్లలో జిల్లా, జేమ్స్ బాండ్ వున్నాయి. దాంతో ఇప్పుడు థియేటర్లు దొరకలేదు. ఏడున శ్రీమంతుడు వస్తే, ఇక ఫుల్ టైట్.
అందువల్ల అది వుండగా వన్ వీక్ రన్నింగ్ వాటికి తప్ప వేరే వాటికి థియేటర్లు ఇవ్వరు. ఆ మాత్రం రన్నింగ్ కు థియేటర్లలో ఏవోసినిమాలు వుండనే వున్నాయి. ఈ వారం విడుదలవుతున్న వాటికి చాలా అంటే చాలా తక్కువ స్క్రీన్ లు దొరికాయి. అది కూడా వారం తరువాత లేచిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే శ్రీమంతుడుకు దాదాపు బాహుబలి పోను మిగిలినవి అన్నీ లాగేస్తారు. సో..థియేటర్ల కోసం కటకట ప్రారంభమైంది.