Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమాకు గ్యాపిచ్చి..కిక్ 2

మహేష్ సినిమాకు గ్యాపిచ్చి..కిక్ 2

మొత్తానికి కిక్ 2 ను లైన్ లోకి తెస్తున్నారు. రెడీ అయినా, ఆ పనీ, ఈ పనీ బ్యాలెన్స్ అంటూ వెనక్కు నెట్టుకుంటూ వచ్చారు. ఫైనాన్స్ కూడా టైట్ అని వదంతి వుండనే వుంది. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి ఎలాగైనా ఆగస్టు 21కి కిక్ 2 విడుదల చేసే ప్రయత్నం అంటున్నారు. ఇప్పటికీ ఇంకా ప్రయత్నం అని అనడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఏడున శ్రీమంతుడు వస్తున్నాడు. దానికి ఓ రెండు వారాలు వదిలేస్తున్నారు. ఒక వారం వదలడం కామన్. మహేష్ సినిమా కనుక, ఎందుకయినా మంచిది అని మరో వారం గ్యాప్ వదిలారు. పైగా ఇంకా వెనక్కు వెళ్లడానికి లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 4న రుద్రమదేవి వస్తోంది. బహుశా అందుకనే కావచ్చు, ఎలాగైనా అన్న పదం వాడారు సురేందర్ రెడ్డి. 

అయితే కిక్ 2 కు చాలా ఎక్కువ ఖర్చు చేసేసారని, ఇందుకోసం కళ్యాణ్ రామ్ భారీగా ఫైనాన్స్ కు వెళ్లాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క కిక్ 2 బిజినెస్ ఇంకా ఓ కొలిక్కి రావాల్సి వుంది. దానా దీనా, 21న విడుదల అంటే కాస్త కిందా మీదా పడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?