మళ్లీ బన్నీయే దిక్కు

పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నది సామెత. ఆర్య , ఆర్య 2 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆర్య 2 హిట్ కాకపోయినా, పేరు వచ్చింది. ఆపై 100 % లవ్ ఓకె.…

పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నది సామెత. ఆర్య , ఆర్య 2 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆర్య 2 హిట్ కాకపోయినా, పేరు వచ్చింది. ఆపై 100 % లవ్ ఓకె. కానీ మహేష్ తో వన్ పట్టాలు తప్పింది. సినిమా ఇస్తానన్న ఎన్టీఆర్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. 

ఇక మరి దిక్కవరు..తన స్టామినా తెలిసిన బన్నీయే కదా..అందుకే అక్కడ చేరాడు సుకుమార్. ఓ లైన్ వినిపించాడట. బన్నీ కూడా ఓకె అన్నాడని వినికిడి. కానీ ఎక్కడా బన్నీకి త్రివిక్రమ్ సినిమా కావాలి. ఆ తరువాతి చాన్స్ కోసం ఇద్దరు ముగ్గురు లైన్లో వున్నారు. అప్పుడు సుకుమార్ వంతు వస్తుంది. పోనీ అప్పుడైనా వస్తే చాలు..మళ్లీ లైన్లో పడతాడు సుకుమార్.