అతనో అప్ కమింగ్ మిడ్ రేంజ్ హీరో. ఆమె అతని మేనేజర్. ఇప్పుడు ఆ మేనేజర్ నే టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో టాకింగ్ పాయింట్ గా మారిపోయింది. తొలి సినిమా సక్సెస్ తరువాత ఈ మేనేజర్ ఆ హీరో దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆ హీరోకి హిట్ లు లేవు.
సరైన ట్రాక్ కానీ, సరైన ఎంపికలు కానీ లేవు. దీనికి కారణం సదరు మేనేజర్ నే అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఈ మేనేజర్ గీసిన గీత దాటడం లేదట. సినిమా ఒప్పుకోవడం దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు హవా అంతా ఈ మేనేజర్ దే నంట.
సదరు మేనేజర్ ఫోన్ చేస్తే ఏ నిర్మాత అయినా కనీసం అరగంట సేపు ఫోన్ చెవికి కట్టేసుకుని వింటూ వుండాల్సిందే. నిర్మాతలు హీరోకి ఏం కన్వే చేయాలన్నా మేనేజర్లకే చెబుతారు. వాళ్లు హీరోకి చెబుతారు. కానీ ఈ మేనేజర్ వ్యవహారం వేరు.
తనే ఎస్, నో, డెసిషన్ చెప్పేస్తారు. నిర్మాత అప్పటికీ ఆశ చావక హీరో దగ్గరకు ఏదో విధంగా విషయం చేరవేస్తే, అక్కడి నుంచి సేమ్ టు సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే అప్పటికీ అక్కడ డెసిషన్ ఫీడింగ్ వెళ్లిపోతుంద్ననమాట. నిర్మాతలు ఈ మేనేజర్ టార్చర్ ఏమిటా? అని సణుగుకుంటున్నారు.
ఈ మధ్య ఓ సీన్ జరుగుతుంటే, హీరోకి పెట్టిన బొట్టు ఈ మేనేజర్ కు నచ్చలేదట. వెంటనే తనే దాన్ని చెరిపేసి, అన్నీ సరిచేసి, బొట్టు పెట్టి ఇక షూటింగ్ కానివ్వండి అంటూ చెప్పేసరికి సెట్ లో వున్న వారంతా ఆశ్చర్యపోయారట. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఘటనలను కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
మొత్తానికి ఓ మేనేజర్ వైఖరి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.