మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో రాజకీయంగా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టనున్నారు. రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్‌కు ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుకెక్కారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించిన సీఎంగా ఆయన గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చేపట్టిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ ఆయన ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. జైసమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆయన పార్టీ గెలుపొందలేకపోయింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
కానీ కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినా కిరణ్ మాత్రం అటు వైపు చూడలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట మాజీ సీఎం కిరణ్ రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ కానుండడం చర్చనీయాంశమైంది.
త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి కిషన్‌రెడ్డితో కిరణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి నాయకుల అవసరం వుంది. ఈ క్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఒక పెద్ద మనిషి ఉన్నట్టవుతుందనే భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. జాతీయస్థాయిలో కిరణ్‌కు కీలక పదవి అప్పగించే అవకాశం వుందని సమాచారం.