Advertisement

Advertisement


Home > Politics - National

వరుస గుండెపోట్లు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

వరుస గుండెపోట్లు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆరోగ్యంగా ఉన్న మనిషి హఠాత్తుగా చనిపోవడం, ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న మనిషి సడన్ గా కన్నుమూయడం.. ఇలాంటివి ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు. వీటన్నిటికీ కామన్ కారణం కనిపెట్టడం ఎవరి వల్లా కావట్లేదు. యువకులు చనిపోతున్నారు, టీనేజర్లకు గుండెపోటు వస్తోంది, ఆరోగ్యంగా ఉన్నవారు కార్డియాక్ అరెస్ట్ తో హఠాత్తుగా మరణిస్తున్నారు. అలవాట్లు, ఆహార నియమాలు, జెనెటిక్ ప్రాబ్లమ్స్.. ఇలా ఏ ఒక్కరిలోనూ కామన్ రీజన్స్ మాత్రం లేవు. అయితే దీని వెనక ఉప్పు అనే కామన్ పాయింట్ ఉంది అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ఉప్పు వాడకం పెరగడం వల్ల వచ్చిన దుష్పరిణామం ఇది అంటూ ఓ నివేదిక విడుదల చేసింది.

ఆ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో ఉప్పు తక్కువైంది అంటూ వంకలు పెట్టేవారు నిజ జీవితంలో మనకు చాలామందే తారసపడుతుంటారు. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది WHO. ఉప్పు తక్కువైంది అనే కారణంతో ఇంకాస్త అదనంగా కలుపుకుని తిన్నారంటే మీకు గుండె ముప్పు పెరిగినట్టే. ఉప్పు, కారం తక్కువగా ఉన్నా సర్దుకుపోయేవారికి ఎలాంటి సమస్యలు ఉండవు.

ప్రాణం తీస్తున్న సోడియం..

వంటల్లో మనం వాడే ఉప్పు సోడియం క్లోరైడ్. ఇందులో ఉండే సోడియం మోతాదు శరీరంలో పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మోతాదు ఎంత అనేదాని దగ్గరే అసలు సమస్య. మనం తినే ఆహార పదార్థాలతో ఏదో ఒక రూపంలో సోడియం మన శరీరంలోకి వెళ్తుంది. 

అయితే ఇటీవల కాలంలో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఈ సోడియం మరింత ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికి అదనంగా మనం రోజువారీ వంటల్లో వేసే ఉప్పు మరింత ముప్పుగా మారుతోంది. సోడియం మోతాదు పెరిగితే గుండె సమస్యలు వస్తాయని చాన్నాళ్లుగా WHO హెచ్చరిస్తోంది. ఇప్పుడు వరుస మరణాల నేపథ్యంలో మరోసారి ఆ నివేదిక బయటపెట్టింది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణించడ‍ం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు WHO వివరించింది. అయితే కేవలం 9 దేశాలు మాత్రమే సోడియం వాడకాన్ని తగ్గించాయని పేర్కొంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, ఊబకాయం, ఎముకలు గుల్లబారడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయి. గుండెపోటు అనే అతి పెద్ద ప్రమాదం ఉండనే ఉంది. ఇప్పటికిప్పుడు ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని WHO నివేదిక తెలిపింది.

ఎంత తినాలి..? ఎంత తింటున్నాం..?

రోజుకి సగటున ప్రతి మనిషి 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలనేది WHO సూచన. కానీ ప్రపంచంలో సగటున ప్రతి మనిషి రోజుకి 10.8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారనేది వాస్తవం. అవసరానికి మించి అది కూడా రెట్టింపు కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్న మనం అనారోగ్యాలకు బలి కాకుండా ఎలా ఉండగలం. అందుకే ఉప్పు మానండోయ్ బాబు ముప్పు తప్పించుకోండోయ్ అంటోంది WHO. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?