సినిమా ఇండస్ట్రీలో మేనేజర్ల ది కీలకపాత్ర. హీరోలు, హీరోయిన్ల డేట్‌లు చూసే మేనేజర్ల మీద చాలా కంప్లయింట్ లు వున్నాయి. నిర్మాతకు హీరో, హీరోయిన్లకు నడుమ వారధుల్లా వుండాలి. కానీ వివిధ ప్రలోభాలకు గురై డేట్‌లు సెట్ చేస్తారని, సినిమాల సెట్ చేస్తారని విమర్శలు వున్నాయి. హీరో, హీరోయిన్లు కూడా ఈ మేనేజర్లు చెప్పినట్లే వింటారని కూడా వినిపిస్తూ వుంటుంది. అయితే ఓ రేంజ్‌కు వెళ్లిన తరువాత ఈ వ్యవహారాలు నడవవు. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే హీరోయిన్ కు తెలియకుండా ఓ నిర్మాత దగ్గర కోటి రూపాయలు లాగేద్దామనుకున్న ఒక మేనేజర్ ఉదంతం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విషయం ఏమిటంటే..
నిర్మాణంలో వున్న ఓ సినిమా కేవలం హీరోయిన్ వ్యక్తిగత సమస్యల వల్ల బాగా ఆలస్యం అయింది. ఈ సినిమాకు ఆమె మూడున్నర కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ తీసుకునేందుకు నిర్ణయం జరిగింది. కానీ సినిమా తన వల్ల బాగా ఆలస్యం అయినందున కోటిన్నరే తీసుకోవాలని అనుకున్నారు. ఈ విషయమే మేనేజర్ తో డిస్కస్ చేసారు. మరీ కోటిన్నర తీసుకోవడం కాదు. రెండున్నర కోట్లు తీసుకుంటే బెటర్ అని మేనేజర్ సదరు హీరోయిన్ ను ఒప్పించారు. అక్కడికి ఓ ఎపిసోడ్ ముగిసింది.
సినిమా విడుదల దగ్గరకు వచ్చింది. మేనేజర్ అసలు విషయం దాని నిర్మాతలను బ్యాలన్స్ కోటి రూపాయలు అడిగారు. సరే, అరేంజ్ చేద్దాం అనగానే.. అక్కౌంట్ పేమెంట్ కాదు, క్యాష్ కావాలన్నారు. కోటి రూపాయలు క్యాష్ అనగానే కాస్త కిందా మీదా పడ్డారు. సరే అని ఓ అకౌంట్ డిటైల్స్ ఇచ్చి దానికి కొట్టమని అడిగారు మేనేజర్. ఆ సంస్థలో కీలకంగా పని చేస్తున్న ఓ ఎంప్లాయి కి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ అక్కౌంట్ ఆ మేనేజర్ కు సన్నిహితమైన మరో నిర్మాత స్నేహితుడి అక్కౌంట్ అది.
దాంతో ఈ విషయం అలా అలా నిర్మాత చెవికి చేరింది. దాంతో హీరోయిన్ ను కాంట్రాక్ట్ చేసి, కోటి రూపాయలు ఎలా ఇవ్వాలి.. అని అడిగేసరికి అవాక్కవ్వడం హీరోయిన్ వంతు అయింది. అసలు తాను రెండున్నర కోట్లు తగ్గిద్దాం అనుకున్నా అని, కోటి తగ్గించేసానని ఇక ఇవ్వక్కరలేదని చెప్పేసరికి, మేనేజర్ డ్రామా బయటకు వచ్చింది.
కానీ అంత మాత్రాన ఆ మేనేజర్ ను పక్కన పెట్టరు.. దూరం పెట్టరు. ఎందుకంటే సదరు మేనేజర్ దగ్గర చాలా అంటే చాలా మంది హీరో, హీరోయిన్ల డేట్ లు వున్నాయి. సో, ఆ అవసరం వుంటుంది కదా. మొత్తం మీద ఓ ఉద్యోగి కీలకంగా, జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల నిర్మాతకు కోటి రూపాయలు ఆదా అయింది. నటులను మేనేజర్లు ఎలా వాడుకుంటారో బయటకు వచ్చింది.