తొమ్మిది కోట్ల ఆఫర్ వద్దన్న హీరో

సాధారణంగా సూక్ష్మంలో మోక్షం వస్తుంది అంటే వద్దనేవారు వుండరు. ముఫై రోజులు డేట్‌లు ఇస్తా 60 కోట్లు ఇవ్వండి అనే హీరోలే ఎక్కువ. స్పెషల్ రోల్ అంటే చాలు మొహమాటం లేకుండా 15 కోట్లు…

సాధారణంగా సూక్ష్మంలో మోక్షం వస్తుంది అంటే వద్దనేవారు వుండరు. ముఫై రోజులు డేట్‌లు ఇస్తా 60 కోట్లు ఇవ్వండి అనే హీరోలే ఎక్కువ. స్పెషల్ రోల్ అంటే చాలు మొహమాటం లేకుండా 15 కోట్లు వసూలు చేసే మాస్ హీరోలు వున్నారిక్కడ.

అలాంటిది జస్ట్ ఓ పది రోజులు వర్క్ చేస్తే చాలు తొమ్మిది కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే నో అన్నాడు హీరో నాగ్ చైతన్య.

విషయం ఏమిటంటే ఓ సినిమా కు చైతన్యను స్పెషల్ క్యారెక్టర్ కు తీసుకుందాం అనుకున్నారు. సినిమాలో హీరో వేరే వుంటారు. స్పెషల్ క్యారెక్టర్ ఒకటి వుంది. అందుకనే చైతన్యను అప్రోచ్ అయ్యారట నిర్మాత. తొమ్మిది కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తానని కబురు చేసినట్లు తెలస్తోంది. దానికి సింపుల్ గా చైతూ నో అన్నాడని తెలుస్తోంది.

సరైన క్యారెక్టర్లు, సరైన సినిమాలు ముఖ్యం కానీ డబ్బులు కాదని, చైతూ నో చెప్పేసాడట. మొత్తం మీద టాలీవుడ్ లో ఎంత తక్కువ డేట్ లు ఇచ్చి, ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిద్దామా అనే హీరోల నడుమ ఇలా ఆలోచించే హీరో కూడా వుండడం ఆనందంమే.