మోడ్రన్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న మనం బాక్సాఫీస్ వద్ద కూడా విజయ ఢంకా మోగిస్తోంది. సాధారణంగా క్లాసిక్స్‌గా పిలవబడే చిత్రాలు కమర్షియల్‌గా అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ వినోదానికి పెద్ద పీట వేసిన విక్రమ్ కుమార్ ‘మనం’తో బయ్యర్లకి బంగారు బాతునిచ్చాడు. సోమవారానికల్లా యుఎస్‌లో మిలియన్ డాలర్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన మనం లోకల్‌గా కూడా అదరగొడుతోంది.
అన్ని ప్రధాన నగరాల్లోను ఈ చిత్రం హెవీ ఫుల్స్‌తో రన్ అవుతూ… పెద్ద రేంజ్‌కి వెళ్లనుందనే సంకేతాలు బలంగా పంపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్ మనం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. బిగ్ బి, అమీర్ ఖాన్, రణ్‌భీర్ కపూర్ ఈ చిత్రంలో నాగేశ్వరరావు, నాగార్జున, చైతన్య చేసిన పాత్రల్ని చేస్తారట.
ఈ కాన్సెప్ట్ బిగ్ బికి బాగా నచ్చడంతో ఆయన ఫిదా అయిపోయి వెంటనే రైట్స్ తీసేసుకున్నారని సమాచారం. అయితే అభిషేక్‌బచ్చన్‌ని కాకుండా అమీర్‌ఖాన్‌ని ఆయన ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు మనం ఇండియా వైడ్ సందడి చేసేస్తోంది. తెలుగు సినిమా గర్వించదగ్గ తరుణమిది.