యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు రొమాంటిక్ హీరో అనిపించుకోడానికి తపిస్తున్నాడు. అతని గత చిత్రం ఇంద్రుడులో లక్ష్మి మీనన్‌తో ఇంగ్లీష్ ముద్దు లాగించిన విశాల్ తన తదుపరి చిత్రం పూజైలో శృతిహాసన్‌తోను లిప్‌లాక్ సీన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. హాట్‌గా కనిపించడానికి మొహమాటాలు లేని శృతి లిప్ లాక్‌కి కూడా ఓకే చెప్పిందా?
ఈ పుకారు మరీ శృతి మించకముందే విశాల్ మీడియా ముందుకి వచ్చేసి క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమీ లేవని, తానేమి సీరియల్ కిస్సర్‌ని కాదని, ప్రతి సినిమాలోను ముద్దులు పెట్టడం తనకి కూడా ఇబ్బందేనని చెప్పాడు. అయితే ఈ చిత్రంలో శృతితో తనకి చాలా మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయని అన్నాడు.
ఈ చిత్రంతో తనకి రొమాంటిక్ హీరోగా మరింత మంచి పేరు వస్తుందని, శృతితో తన కెమిస్ట్రీ బాగుందని యూనిట్ సభ్యులు ప్రశంసిస్తున్నారని విశాల్ చెప్పాడు. కానీ ఇందులో లిప్‌లాక్స్ లాంటివి ఉండవని పదే పదే క్లారిటీ ఇస్తున్నాడు. శృతి తనకంటే పెద్ద స్టార్ కాబట్టి ఎక్కడ అఫెండ్ అవుద్దోనని విశాల్ కంగారు పడుతున్నట్టున్నాడు.