రామ్ చరణ్ 2015 వరకు బిజీ అయిపోయాడు. ఇక అతనితో కొత్త సినిమాలు సైన్ చేసుకోవాలంటే 2015 తర్వాతేనట. అతని తదుపరి చిత్రాలు అన్నిటికీ ఫ్రెష్‌గా హిట్స్ ఇచ్చి ఉన్న దర్శకులే పని చేయనుండడం విశేషం. చరణ్ ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలే చేస్తూ బిజీగా ఉన్నాడు. దీనికి ఫామ్‌లో లేని కృష్ణవంశీ దర్శకుడు అయినా కానీ ఫాన్స్ చింత చెందాల్సిన అవసరం లేదు.
శ్రీను వైట్లతో ఒకటి, బోయపాటి శ్రీనుతో మరోటి కమిట్ అయిన చరణ్ ‘రేసుగుర్రం’ దర్శకుడు సురేందర్‌తో ఒక సినిమా చేస్తున్నాడని టాక్ ఉంది. సురేందర్ రెడ్డి ఇప్పటికే చరణ్‌ని రెండుసార్లు కలిసాడట. అతని కిక్ 2 తర్వాత రూపొందే సినిమా చరణ్‌దేనని అంటున్నారు. అది కూడా రేసుగుర్రం తరహాలో కమర్షియల్ ఎంటర్‌టైనరే అట.
ఇక మనంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన విక్రమ్ కుమార్ కూడా తన తదుపరి చిత్రం చరణ్‌తో చేస్తాడని వినిపిస్తోంది. మనం విడుదలకంటే ముందే చరణ్‌తో ప్రపోజల్ ఉందట. మనం ఇంత పెద్ద హిట్ అవడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయినట్టే అంటున్నారు. ఇంకా అధికారికంగా దీనిపై ప్రకటన రాలేదు.