అవసరం మనిషిని ఎంతకయినా దిగజార్చుతుంది. అలాంటిది ఎలక్షన్ సీజన్‌లో అయితే ఆ మనిషిలోని అన్ని అవతారాలూ బయటపడతాయి. జనసేన పార్టీ నాయకుడు పవన్‌కళ్యాణ్ తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి సాధారణ వ్యక్తిలా గెడ్డం పెంచుకుని, నలిగిపోయిన డ్రెస్ వేసుకుని కాళ్ళకు హవాయి చెప్పులతో ప్రజల్లోకొస్తే.. జనం అతని వేషానికి సమ్మోహితులైపోయారు. పవన్ రేపు రాష్ట్రానికి దిశా నిర్దేశం అని భావించారు. సొంతంగా టైమ్ లేక భాజపా, తెలుగుదేశం కొమ్ముకాసి.. పల్లకీ మోసిన బోయీ అయ్యాడు. ఎలక్షన్స్‌లో ఆయన టార్గెట్ ముగిశాక ఇప్పుడు వేషం మార్చేశాడు.
చంద్రబాబు కృతజ్ఞతగా ఇచ్చిన విందుకు హాజరయిన పవన్‌కళ్యాణ్ నీట్‌గా షేవ్ చేసుకుని, జుట్టుకి డై వేసుకుని, డిజైనర్ డ్రెస్‌తో అచ్చు సినిమా స్టయిల్లో వచ్చాడు. ప్రజా నాయకుడి గెటప్ తీసి పక్కన పెట్టాడు. పవన్ తిట్టిన తిట్లకు తెలంగాణలో టీడీపీకి తీవ్ర నష్టం కలిగింది. ఆంధ్రాలో స్కోర్ చేశాడంటున్నారుగానీ, రిజల్ట్ వస్తేగానీ తెలియదు. పక్కా రాజకీయ నాయకుడిలా రంగులు మారుస్తున్న పవన్‌కళ్యాణ్, ప్రజల్లో విశ్వాసం కోల్పోకూడదంటే మళ్ళీ ప్రజలతో మమేకమవ్వాలి. అలా జరగాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి కదా.