మన్మధుడు 2 సినిమా మాంచి బజ్ మధ్య విడుదలయింది. అయితే యావరేజ్ టాక్ వచ్చింది క్రిటిక్స్ నుంచి. ఆ సంగతి అలావుంచితే సినిమాలో చాలా ఫన్ సీన్లు ఎడిటింగ్ కు ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రావురమేష్ కు చాలా సీన్లు వున్నాయని, అవన్నీ ఫన్ పండించినవే అ ని తెలుస్తోంది. కానీ సినిమాలో చూస్తే అవేమీ అంతగా కనిపించలేదు. స్టార్టింగ్ లో ఇచ్చిన బిల్డప్ తరువాత ఆ పాత్రను పక్కన పెట్టినట్లు అయింది.
అలాగే ఫ్యామిలీ సీన్లు, ముఖ్యంగా ఆదివారం డైనింగ్ టేబుల్ దగ్గర చాలా వున్నాయని తెలుస్తోంది. అవి కూడా కత్తెరకు గురయినట్లున్నాయి. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత ఫైనల్ ఎడిట్ చేయడం అన్నది ఇటీవల నాగార్జునకు అలవాటు అయింది. చాలా సినిమాలకు అది ప్లస్ అయిన దాఖలాలు వున్నాయి. దాంతో ఆయనకు తన నిర్ణయాల మీద కాన్ఫిడెన్స్ పెరిగింది.
ఈ నేపథ్యంలోనే మన్మధుడు 2 సినిమా విషయంలో కూడా ఆయన కాస్త నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అయితే అలా వ్యవహరించినా మన్మధుడు 2 నిడివి బాగానే వచ్చింది. అప్పటికే రెండు గంటల ముఫై అయిదు నిమషాల నిడివి వచ్చింది. బహుశా అందుకే కథకు అడ్డంపడే సీన్లు నాగ్ లేపేసి వుంటారు.