cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మనోజ్ గేమింగ్ జోన్ ప్లాన్లు?

మనోజ్ గేమింగ్ జోన్ ప్లాన్లు?

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ కాస్త గ్యాప్ తరువాత సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చేస్తూనే మనోజ్ మరో ప్లాన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గేమింగ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్  జోన్. ఓ విశాలమైన స్థలంలో రకరకాల ఎంటర్ టైన్ మెంట్లు, గేమింగ్ లు, ఇతరత్రా వ్యవహారాలను సెటప్ చేస్తూ ఓ ఫన్ జోన్ ను క్రియేట్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి కొన్ని ఎకరాల స్థలం కావాలి. అందుకోసం ఆయన తెలంగాణ ప్రభుత్వం ద్వారా లీజుకు తీసుకునే ఆలోచనలో వున్నారని బోగట్టా. టోటల్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సబ్ మిట్ చేసి, ప్రాసెస్ చేసే పనిలో మనోజ్ వున్నారని టాక్ వినిపిస్తోంది.

మంచు ఫ్యామిలీ హీరో విష్ణు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. విద్యా సంస్థలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో హీరో మనోజ్ కూడా ఇదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం