టాలీవుడ్ కు కరోనా కొత్త మార్గం చూపింది. ఓటిటి, ఏటిటి అంటూ కొత్త అవకాశాలు చూపించింది. ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు ఓ నలభై వరకు చిన్న, బుల్లి సినిమాలు రెడీ అవుతున్నాయంటే కారణం కరోనా చూపిన మార్గమే. ఇప్పటికే శ్రేయాస్ ఏటిటి ఒకటి వుంది.
ఇప్పుడు మరోటి వచ్చేనెల ప్రారంభం అవుతోంది.బన్నీవాస్, ఆయన మిత్రుడు కేదార్ తదితరులు దీని వెనుక వున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏటిటి ఆరేడుసినిమాలతో ఒప్పందం చేసుకుంది.
వాటిల్లో నిర్మాత ఎమ్ ఎస్ రాజు రూపొందించిన ఎరోటిక్ సినిమా 'డర్టీ హరి' కూడా వుంది. ఈ ఎటిటి వచ్చేనెల 18న ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీని పేరు ఇంకా తెలియలేదు.
ఈ సినిమా తరువాత ఇలాంటి సినిమాలు వరుసగా ప్రతి రెండువారాలకు ఒకటి వంతున విడుదల చేస్తారని తెలుస్తోంది.