తెలుగు సినిమా హీరోల వారసులకి ఉండే క్రేజ్ దర్శకులు, నిర్మాతల కొడుకులకి రాదు. చాలా అరుదుగా మాత్రమే నిర్మాతల వారసులు హీరోలుగా సక్సెస్ అయ్యారు. వెంకటేష్ తర్వాత చాలా మంది నిర్మాతలు, దర్శకులు, కమెడియన్ల కొడుకులు హీరోలయ్యారు కానీ వారిలో సక్సెస్ అయిన వాళ్లు చాలా చాలా తక్కువ.
స్రవంతి రవికిషోర్ సోదరుడి తనయుడు అయిన రామ్ మినహా ఈమధ్య అలా సక్సెస్ అయిన హీరోలు లేరు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతుండడంతో ఇతను సక్సెస్ అవుతాడా లేదా అని చర్చ మొదలైంది. హీరోల కొడుకులకి అయితే హీరో కాకముందే ఫాన్స్ అసోసియేషన్లు, హంగామాలు ఉంటాయి కానీ సాయి శ్రీనివాస్ మాత్రం తనని తాను నిరూపించుకున్నాకే అవన్నీ పుట్టుకొస్తాయి.
మొదటి సినిమాతో అతను ఎంతగా సక్సెస్ కాగలడు అనేదే అతని ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. వినాయక్ అయితే సాయి శ్రీనివాస్ తప్పకుండా పెద్ద హీరో అవుతాడని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. మరితను మరో వెంకీ అవుతాడో లేదో ఈ నెలాఖరులోగా ఒక ఐడియా వచ్చేస్తుంది.