సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి చేతికి ఓ కీలకమైన ప్రాజెక్టు వస్తున్నట్లు వినికిడి. మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడిని సినిమా రంగానికి పరిచయం చేసే బాధ్యతను మారుతికి అప్పగించే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు కుమారుడు తెలుగు సినీ తెరకు పరిచయం అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ మేరకు ఓ స్క్రిప్ట్ ఓకె చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాణం ఏ సంస్థ ద్వారా అన్నది ఇంకా ఖరారు కాలేదు.
బహుశా మంత్రి గంటాతో వున్న సన్నిహిత సంబంధాల రీత్యా, అల్లు అరవింద్ కానీ, హారిక హాసిని రాధాకృష్ణ కానీ నిర్మాతగా వుండే అవకాశాలు వున్నాయి. వివి వినాయక్, పూరి జగన్నాధ్ మాదిరగా మారుతి కూడా మంచి లాంచింగ్ హాండ్ గా మారితే, ఇక చాలా మంది వారసులు మారుతికేసి చూస్తారు.