‘మసాలా’ డేటు డౌటే!

వెంకటేష్‌, రామ్‌ల ‘మసాలా’ డేటు ఇప్పుడు డౌటులో పడింది. ఈ సినిమాని దసరాకి తీసుకొద్దామనుకొన్నారు. అయితే… వీలు కాలేదు. నవంబరు 1న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే రోజున ఈ సినిమా రావడం…

వెంకటేష్‌, రామ్‌ల ‘మసాలా’ డేటు ఇప్పుడు డౌటులో పడింది. ఈ సినిమాని దసరాకి తీసుకొద్దామనుకొన్నారు. అయితే… వీలు కాలేదు. నవంబరు 1న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే రోజున ఈ సినిమా రావడం కష్టమే అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 

మసాలాలో ఓ గీతం ఇంకా బాకీ ఉంది. ఆ పాట పూర్తిచేయాలి. దానితో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌.. ఈ తతంగానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. పైగా అప్పటికి భాయ్‌ సినిమా ఆడుతూనే ఉంటుంది. థియేటర్లు కావల్సిన సంఖ్యలో దొరకవు. అందుకే ఈ సినిమాని నవంబరు 8న గానీ, 15న గానీ విడుదల చేయాలనుకొంటున్నారట.

రేపో మాపో ‘మసాలా’ కొత్త రిలీజ్‌ డేటు ప్రకటించే అవకాశం ఉంది.