విశాల్‌ నిరీక్షణ ఫలించింది

 తెలుగు కుర్రాడే అయినా.. తమిళంలో స్థిరపడిపోయాడు విశాల్‌. రంగూ అలాగే ఉంటుంది కాబట్టి, తమిళ హీరో అంటే జనం పడీ పడీ నమ్మేస్తారు. ఆయన సినిమాలు అనువాదాల రూపంలోనే వచ్చాయి. Advertisement నేరుగా ఓ…

 తెలుగు కుర్రాడే అయినా.. తమిళంలో స్థిరపడిపోయాడు విశాల్‌. రంగూ అలాగే ఉంటుంది కాబట్టి, తమిళ హీరో అంటే జనం పడీ పడీ నమ్మేస్తారు. ఆయన సినిమాలు అనువాదాల రూపంలోనే వచ్చాయి.

నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలి.. చేస్తా.. అని  విశాల్‌ ఎప్పటి నుంచో అంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లకు విశాల్‌ నిరీక్షణ ఫలించింది. త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా తమిళంలో విడుదల చేయరట. 

ఎందుకంటే అలా చేస్తే దీన్నీ డబ్బింగ్‌ బొమ్మే అని తెలుగు ప్రేక్షకులు భావించే ప్రమాదం ఉందని విశాల్‌ భయపడుతున్నాడు. 2014 జనవరిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లబోతోంది.