నిషా అగర్వాల్‌కి పెళ్లికుదిరిందోచ్… అనగానే అందరి దృష్టీ కాజల్‌పై పడింది. అక్కకి పెళ్లికాకుండా, చెల్లాయికి ఏమిటి? అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. అయితే ` కాజల్ కూడా పెళ్లికి రెడీగానే ఉందట. కాజల్‌కి కూడా తగిన వరుడు దొరికిన తరవాతే.. నిషా పెళ్లి ఖాయం చేశారని తెలిసింది.
కాజల్ ఈమధ్య తెలుగు సినిమాల్ని ఒప్పుకోకపోవడం, సినీ పరిశ్రమకు అంటీ ముట్టనట్టుగా ఉండడానికి కారణం.. ఇదే అని టాక్. పెళ్లి చేసుకొనే ఆలోచన వచ్చినందువల్లే కాజల్ సినిమాల్ని వదులుకొంటోందట. డిసెంబరు 28న నిషా అగర్వాల్ పెళ్లి కుదిరింది. అంతకంటే ముందే.. కాజల్ పెళ్లి కబురు విన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ తీపి వార్త కోసం వేచి చూద్దాం.