హలోబ్రదర్‌ అంటున్న నరేష్‌!

నాగచైతన్య చేద్దామనుకొన్న హలోబ్రదర్‌ని అల్లరి నరేష్‌ రీమేక్‌ చేస్తున్నాడా ఏంటి…?  అనే అనుమానాలొద్దు. ఇది వేరే కథ. కాకపోతే డ్యూయల్‌రోలే. నరేష్‌ ` ఇ.సత్తిబాబు కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. తమిళంలో ఘన విజయం…

నాగచైతన్య చేద్దామనుకొన్న హలోబ్రదర్‌ని అల్లరి నరేష్‌ రీమేక్‌ చేస్తున్నాడా ఏంటి…?  అనే అనుమానాలొద్దు. ఇది వేరే కథ. కాకపోతే డ్యూయల్‌రోలే. నరేష్‌ ` ఇ.సత్తిబాబు కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కలగలపు’ అనే చిత్రానికి ఇది రీమేక్‌. అంబికా కృష్ణ నిర్మాత. ఈ సినిమాలో నరేష్‌ డ్యూయల్‌రోల్‌ చేస్తున్నాడు. కథ కూడా కాస్త అటూ ఇటూగా ‘హలో బ్రదర్‌’ని పోలి ఉంటుందట. 

దర్శకుడు కూడా ఇదే మాట చెబుతున్నాడు. ‘హలో బ్రదర్‌’లో నాగార్జునకు ఎంత పేరొచ్చిందో, ఈ సినిమాలో నరేష్‌కీ అంతే వస్తుందని చెబుతున్నారాయన.  ఓ పాత్ర  క్లాస్‌ అయితే, మరోటి మాస్‌ అట. ఈ తరహా పాత్రలు చేయడం నరేష్‌కి ఇదే తొలిసారి అని సత్తిబాబు చెబుతున్నారు.  

సత్తిబాబు. నరేష్‌ కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ‘బెట్టింగ్‌బంగార్రాజు’ ఓ మాదిరిగా ఆడినా,  ‘యముడికి మొగుడు’ మాత్రం బోల్తా కొట్టింది. మరి ‘హలోబ్రదర్‌’ ఏం చేస్తాడో చూడాలి.