నాని-సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్, దిల్ రాజు బ్యానర్ వాల్యూ పక్కాగా వర్కవుట్ అయ్యాయి. ఎంసిఎ సినిమాను విజయతీరానికి చేర్చాయి. సినిమాకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా, జనం ఆదరించారు. అందులో సందేహం లేదు. కాదనడానికి లేదు. కానీ బయ్యర్ల సంగతేమిటి? దిల్ రాజు ఆ మధ్య మాట్లాడుతూ బయ్యర్లు ఏడాదికి ఓసారి బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి కానీ, సినిమా సినిమాకు లాభం, నష్టం లెక్క పెట్టకూడదు అన్నారు. కానీ ఈ సినిమాలో వచ్చింది, ఆ సినిమాలో పోయింది అని అనుకోవడం కామన్ కదా?
ఆ లెక్కలో చూస్తే, ఎంసిఎ 12రోజులకు (అంటే 21నుంచి జనవరి 1వరకు) వసూళ్లు చూడాలి. 12రోజులకు వసూళ్లు, ఆ పక్కన బ్రాకెట్లలో కొనుగోలు రేట్లు గమనించండి. నైజాం, వైజాగ్ రెండు ఏరియాలను నిర్మాత దిల్ రాజునే పంపిణీ చేసుకున్నారు. అయితే అక్కడా ఇంత అని రాసుకుంటారు. ఎందుకంటే నిర్మాతగా కంపెనీ వేరు. పంపిణీ దారుగా కంపెనీ వేరు కాబట్టి.
నైజాం 13కోట్లు (8కోట్లు), సీడెడ్ 4.5 కోట్లు (4కోట్లు), ఉత్తరాంధ్ర 3.70 (3.00), గుంటూరు 1.95 (2.40) కృష్ణ 1.60 (2.00), వెస్ట్ 1.60 (1.70), ఈస్ట్ 2.00 (1.90) నెల్లూరు 0.90 (1.00) ఓవర్ సీస్ 3.50 అంటున్నారు. నాలుగుకోట్లు అని అంటున్నారు. కరెక్ట్ ఫిగర్ తెలియాలి. అయితే అక్కడ షేర్ 3.85 వచ్చింది.
ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వారాలకు చూసుకుంటే నైజాం భారీ లాభం, ఫిదాతో ఫిదా చేసిన సాయిపల్లవి ఎఫెక్ట్ ఇది. సీడెడ్, ఉత్తరాంధ్ర, బ్రేక్ ఈవెన్ అయ్యాయి. నైజాం, వైజాగ్ నిర్మాత దిల్ రాజుదే. అంటే బ్రేక్ ఈవెన్ అయిన బయ్యర్ సీడెడ్ మాత్రమే అన్నమాట.
ఇక ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఈ వారంతో పెట్టుబడి వెనక్కు వస్తుంది. ఇంకా ఖర్చులు రావాలి.. కృష్ణా ఇంక కష్టం కావచ్చు. దీనికి కారణం నాని సినిమాను మాంచి రేట్లకు అమ్మడమే. ఒక్క ఆంధ్రనే పదికోట్ల రేషియోలో అమ్మారు. నైజాం 8కోట్లు, సీడెడ్ 4కోట్లు. అంటే టోటల్ గా ఎపి, తెలంగాణ కలిపి 22కోట్ల రేంజ్ లో అమ్మారు. నాని మార్కెట్ రీత్యా ఇది చాలా పెద్ద అమౌంట్ నే. అయితే ఇప్పుడు దగ్గరకు చేరారు కాబట్టి హ్యాపీ అనుకోవచ్చు.
ఇప్పుడు ఆంధ్రలో పండగసీజన్ నడుస్తోంది. జనాలంతా థియేటర్ల వైపు కన్నా బట్టల దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈవారం సినిమాలు ఏవీ లేవు. అయినా కూడా వచ్చే షేర్ పెద్దగా ఏమీ వుండదు. అందువల్ల నైజాం, వైజాగ్ ఫిగర్లు పక్కన పెడితే ఎంసిఎ సినిమా బయ్యర్లకు పెద్దగా ఇచ్చింది లేదనే చెప్పాలి. అయితే దిల్ రాజు బయ్యర్లకు మళ్లీ వెంటనే ఏదో సినిమా వుంటుంది. అక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఓకె.