ఒకస్టేజ్ లో రామ్ చరణ్, మహేష్, వెంకీ, ఎన్టీఆర్ ల సినిమాలతో బిజీగా వున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఆయాసం ఎక్కువ లాభాలు తక్కువ అనే టైపు సినిమాలైపోయాయి. ఒక స్టేజ్ లో దిల్ రాజు పనైపోయింది అన్నటాక్ కూడా వినిపించింది. దాంతో మళ్లీ దిల్ రాజు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది. తన బ్యానర్, తన జడ్జ్ మెంట్, కాస్త క్రౌడ్ పుల్లింగ్ వున్న హీరో..దీంతో ఆరేడు కోట్లలో సినిమా లాగించేసి, లాభాలు చేసుకోవచ్చు.
ఓకే బంగారం తెలుగు వెర్షన్ కొన్నాడు. ఇక్కడ ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాకున్నా, ఓవర్ సీస్, శాటిలైట్ అన్నీ కలుపుకుని లాభమే చేసుకున్నాడు. కేరింత అంటూ సుమంత్ అశ్విన్ తో చిన్న సినిమా చేసాడు..ఎంత కొంత లాభమే చేసుకున్నాడు తప్ప, నష్టపోలేదు. ఇప్పుడు సాయి ధరమ్ తేజతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేసాడు. ఖర్చు ఎంత అయింది అన్నదానిపై ఇదమిద్దంగా చెప్పడం లేదు కానీ, సాయి ధరమ్ తేజకు మూడో సినిమా, హరీష్ శంకర్ కు సినిమా ఇవ్వడమే మహా ప్రసాదం అనేంత బ్యాడ్ టైమ్, వెరసి మహా అయితే అయిదు నుంచి పది కోట్ల మధ్యలో కానిచ్చి వుంటారని అంచనా.
ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ ఏడు కోట్లకు పైగా వచ్చిందని అంటున్నారు. అంటే సేప్ జోన్ లోకి వెళ్లిపోయినట్లే అనుకోవాలి. ఎలాగూ శాటిలైట్ వుంది కాబట్టి. ఇప్పుడు సునీల్ తో ఒక సినిమా, సాయిధరమ్ తేజతో మరో సినిమా సెట్ ల మీద వున్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే నానితో ఓ సినిమా ఓకె చేసేందుకు అంగీకారం కుదర్చుకున్నారని.
ఇది కాక మారుతితో కలిసి ఒక మీడియం సినిమా చేయబోతున్నారు. అంటే ఇప్పటికి ఓకె అయినవే నాలుగు మీడియం ప్రాజెక్టులు. ముఫై నలభై కోట్ల సినిమా తీసి, ఆయాసపడి, కోటి రూపాయిలు వెనకేసుకోవడం కంటే, ఆరేడు కోట్ల సినిమా తీసి, ఆ కోటి రూపాయిలే వెనకేసుకోవడం బెటర్..పైగా ఇండ్రస్ట్రీ వర్కర్లకు కాస్త పని దొరుకుతుంది.