మీడియం సినిమాకు ఇద్దరు

సాధారణంగా భారీ సినిమాలకు లేదా పెద్ద పెద్ద సినిమాలకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు పనిచేయడం కామన్. పాటలకు ఒకరిని, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు మరొకరిని పెట్టుకుంటారు.అలాగే కేవలం పాటలు మాత్రమే చేసే వారయితే…

సాధారణంగా భారీ సినిమాలకు లేదా పెద్ద పెద్ద సినిమాలకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు పనిచేయడం కామన్. పాటలకు ఒకరిని, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు మరొకరిని పెట్టుకుంటారు.అలాగే కేవలం పాటలు మాత్రమే చేసే వారయితే బ్యాక్ గ్రవుండ్ కు వేరేవారిని తీసుకుంటారు. కానీ మీడియం సినిమాలకు అలా వుండదు.

కానీ మీడియం రేంజ్ లో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మించిన అశ్వద్ధామ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ లు పనిచేయడం విశేషం. ఇటు ఫ్యామిలీ, రొమాంటిక్ టచ్ అటు థ్రిల్లర్ జోనర్ కలిపి తీసిన ఈ సినిమాకు పాటల కోసం శ్రీచరణ్ పాకాల ను తీసుకున్నారు. అలాగే సినిమాకు బ్యాక్ గ్రవుండ్ కీలకం కావడంతో జిబ్రాన్ ను తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఈ విషయం వెల్లడించలేదు. ఈ రోజు రాబోతున్న సినిమా ట్రయిలర్ తో ఆ విషయం వెల్లడిస్తున్నారు. ఈ నెల 31న విడుదల కాబోతున్న అశ్వద్దామకు ఉష మాల్పూరి నిర్మాత.

కూల్చెయ్య‌డానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు

రాజ్ డిస్కో రాజ్