మీ.. మా.. చె.. సెన్సారు పూర్తి

విజయ్ దేవరకొండ, ఆయన తండ్రి కోసం నిర్మించిన సినిమా మీకు మాత్రమే చెప్తా. అతి తక్కువ అంటే సుమారు రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాకు షమీర్ సుల్తాన్ దర్శకుడు. నవంబర్…

విజయ్ దేవరకొండ, ఆయన తండ్రి కోసం నిర్మించిన సినిమా మీకు మాత్రమే చెప్తా. అతి తక్కువ అంటే సుమారు రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాకు షమీర్ సుల్తాన్ దర్శకుడు. నవంబర్ 1న విడుదలయ్యే ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.

దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్ మరో రెండు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఆయన కాస్త ఎక్కవ బజ్ నే తీసుకురాగలిగారు.

ఈ సినిమా ఫస్ట్ కాపీని డిస్ట్రిబ్యూటర్ ఆషియన్ సునీల్ కు అమ్మడం ద్వారా నిర్మాణ ఖర్చులు తెచ్చేసుకున్నారు. ఆపై డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్మడం ద్వారా టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. విజయ్ కు వున్న క్రేజ్ ఈ ప్రాజెక్టు కోసం బాగానే ఉపయోగపడింది. ఈ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ అన్నీ విజయ్ ఈ సినిమాకు చేసిన ప్రమోషన్ వర్క్, ప్లస్ పబ్లిసిటీ ఫలితంగానే. ఆపైన సినిమా ఏమాత్రం బాగున్నా వర్కవుట్ అయిపోతుంది.

తరుణ్ భాస్కర్ పాత్రకు సంబంధించిన కీలక విడియో ఒకటి లీక్ అయి, యూట్యూబ్ లో చేరడం, దాని పర్యవసానాలు అనే కాన్సెప్ట్ మీద 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించారు.

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?