శివసేనను బీజేపీ చీల్చగలదా?

ఈ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే తొలిసారి బరిలోకి దిగడంతోనే శివసేన తన లక్ష్యాన్ని  స్పష్టంచేసింది. ఇదివరకూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో కూడా ఠాక్రే వంశీకులు ఎవ్వరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఉద్ధవ్…

ఈ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే తొలిసారి బరిలోకి దిగడంతోనే శివసేన తన లక్ష్యాన్ని  స్పష్టంచేసింది. ఇదివరకూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో కూడా ఠాక్రే వంశీకులు ఎవ్వరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఎన్నికల్లో పోటీచేశాడు. తద్వారా శివసేన ముఖ్య పదవిని టార్గెట్ గా చేసుకుంది.

బహుశా సేన తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగానే సాగుతున్నట్టుగా ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్లు శివసేన తయారు చేసిన ఫార్ములాకు తలొగ్గే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి, మిగతా పదవులన్నీ సగం-సగం. ఇదీ శివసేన తయారు చేసిన ఫార్ములా. ఇప్పటి వరకూ బీజేపీ ఈ విషయంలో అధికారికంగా ఏమీ స్పందించడం లేదు. శివసేన డిమాండ్స్ కు గట్టిగా నో అని చెప్పే పరిస్థితుల్లో లేదు కమలం పార్టీ  కూడా. అలా చేస్తే శివసేనకు ఆప్షన్స్ ఉన్నాయనే విషయం ఆ పార్టీకి తెలియనిది కాదు.

ఒకవేళ ఏ ఉద్ధవ్ ఠాక్రేనో తీహార్ జైలుకు పంపించి, బలవంతంగా శివసేన మద్దతు తీసుకోవడం కానీ, శివసేనను చీల్చి బీజేపీలోకి విలీనం చేసుకునే వ్యూహాలు కానీ బీజేపీ వాళ్లు అమలు చేయడం అంత తేలికేమీ కాదు. ఒకవేళ బీజేపీ తను చెప్పినట్టుగా ఒప్పుకోకపోతే.. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో సేన చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అలాంటి పరిస్థితి రానీవ్వొద్దు అని మాత్రమే బీజేపీకి సేన నాయకులు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు!

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?