Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా అల్లుడు 'విజేత'

మెగా అల్లుడు 'విజేత'

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి సినిమా చకచకా ముస్తాబయిపోతోంది. కాస్త టేస్ట్ వున్న నిర్మాత సాయి కొర్రపాటి మెగా అల్లుడిని లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విజేత' అని ఫిక్స్ చేసారు.

గతంలో ఓ చిన్న సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్ శశి అందించిన స్క్రిప్ట్ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలయ్యకు, నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సాయి కొర్రపాటి తన మెగా అల్లుడు సినిమాకు 'విజేత' అంటూ మెగా స్టయిల్ టైటిల్ నే ఫిక్స్ చేసారు.

చిరంజీవి సినిమాల్లో విజేత సినిమాకు ఓ మాంచి స్థానం వుంది. సూపర్ టైటిల్, మంచి బ్యానర్ తో, వీలయినంత లో ప్రొఫైల్ లో కళ్యాణ్ దేవ్ ను లాంచ్ చేయడం వెనుక మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ వుందని ఇండస్ట్రీ టాక్.

మెగా హీరోగా కాకుండా మంచి నటుడిగా కళ్యాణ్ దేవ్ ను అందించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?