ఎన్టీఆర్ సినిమాకు కాస్ట్ కటింగ్?

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈషా రెబ్బా కూడా వుందని వార్తలు బయటకు వచ్చాయి. దాంతో ఎప్పటిలాగే తివిక్రమ్ సెకెండ్ హీరోయిన్ గా ఈషాను తీసుకున్నాడని అదనపు వార్తలు పుట్టుకు వచ్చాయి. కానీ అందుతున్న సమాచారం…

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈషా రెబ్బా కూడా వుందని వార్తలు బయటకు వచ్చాయి. దాంతో ఎప్పటిలాగే తివిక్రమ్ సెకెండ్ హీరోయిన్ గా ఈషాను తీసుకున్నాడని అదనపు వార్తలు పుట్టుకు వచ్చాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో ఈషా పాత్ర మరీ పెద్దది కాదని తెలుస్తోంది. ఆ మాటకు వస్తే చాలా చాలా చిన్న పాత్ర అని, అయితే పాత్రలు చిన్నవి, అయినా పెద్దవి అయినా కీలకమైన వారిని తీసుకునే అలవాటు వున్న త్రివిక్రమ్, ఈ సారీ అలాగే చేస్తున్నారని తెలుస్తోంది.

ఇంకా మరికొంత మంది కీలకనటులు కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇదిలా వుండగా, గతంతో పోల్చుకుంటే ఈ సారి త్రివిక్రమ్ సినిమాను కాస్త తక్కువ బడ్జెట్ లో తీయాలని ఫిక్సయినట్లు వార్తలు వినవస్తున్నాయి. అ..ఆ లాంటి చిన్న సినిమాను కూడా 35కోట్లకు పై బడ్జెట్ తో తీసారు త్రివిక్రమ్. ఇక అజ్ఞాతవాసి అయితే డబ్బులు విపరీతంగా ఖర్చుచేసారు. ఎక్కడి నుంచో సినిమాటోగ్రాఫర్ ను తెచ్చి, పవన్ కోసం మామూలు షాట్లకు కూడా గ్రీన్ మాట్ వేసి ఇలా చాలా చేసారని అప్పట్లో వార్తలు వినవచ్చాయి. తాను ఖర్చు ఎక్కువే పెట్టిస్తానని త్రివిక్రమ్ కూడా ఓపెన్ గా చెప్పారు.

అయితే ఈసారి అలా కాకుండా కాస్త లిమిటెడ్ బడ్జెట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి విషయంలో నిర్మాత చినబాబుకు వచ్చిన నష్టాన్ని చాలా వరకు పూడ్జే ప్రయత్నం చేస్తున్నారని, అంతే కాకుండా హారిక హాసిని రెగ్యులర్ బయ్యర్లకు కాస్త డిస్కౌంట్ రేట్లకు ఈ సినిమాను ఇవ్వాల్సి వుంటుంది కాబట్టి, ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని వెల్ ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తన సినిమా తక్కువలో చుట్టేస్తున్నారని ఎన్టీఆర్ ఫీల్ కాకుండా, చాలా స్మూత్ గా ఆపరేట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాస్ట్ కటింగ్ అన్నది స్మూత్ గా కనపడకుండా చేసి, సినిమాను మాత్రం ఎన్టీఆర్ సినిమాల్లో అన్నింటికన్నా హయ్యస్ట్ రేట్లకు అమ్మాలని ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారని, అప్పుడు హీరో కూడా ఫీలయ్యే సమస్య వుండదని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అజ్ఞాతవాసికి అనిరుధ్ కు భారీగా పే చేసారు. ఈ సినిమాకు థమన్ కు రెగ్యులర్ గా తీసుకునే లక్షల్లో రేటునే ఆపర్ చేసారని తెలుస్తోంది. కానీ థమన్ కాస్త బేరసారాలు సాగించాక, కొంచెం మాత్రమే పెంచారని వినికిడి. అదే దేవీ అయితే బడ్జెట్ కనీసం రెండు కోట్లు తేడా వచ్చేదని తెలుస్తోంది. ఇలా ప్రతి చోటా జాగ్రత్త పడుతున్నారని, కాస్టింగ్ లో కూడా ఇదే జాగ్రత్త తీసుకుంటున్నారని వినికిడి.

ఇదిలా వుంటే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇంత జాగ్రత్త పడుతుంటే, శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా మాత్రం కాస్త గట్టిగానే బడ్జెట్ లాగేస్తోందని తెలుస్తోంది. ఒక్క సెట్ కే కోటిరూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. శర్వానంద్ రెండు గెటప్ లు, కథలో రెండు వేరియేషన్లు వుండడతో అక్కడ మాత్రం కాస్త ఖర్చు గట్టిగానే అవుతోందని టాక్ వినిపిస్తోంది.