మెగాక్యాంప్ కు ‘మా’..దూరం దూరం?

మా టీవీ అంటే ఇటు నాగార్జున అటు మెగాస్టార్ ఫ్యామిలీల ఇంటి సంస్థలాంటిది. తెల్లవారితే చాలు వారి సినిమాలతోనే వుంటుంది. అవార్డుల ఫంక్షన్ చేస్తే చాలు అయితే అరవింద్ లేకుంటే నాగార్జున తప్ప మరొకరు…

మా టీవీ అంటే ఇటు నాగార్జున అటు మెగాస్టార్ ఫ్యామిలీల ఇంటి సంస్థలాంటిది. తెల్లవారితే చాలు వారి సినిమాలతోనే వుంటుంది. అవార్డుల ఫంక్షన్ చేస్తే చాలు అయితే అరవింద్ లేకుంటే నాగార్జున తప్ప మరొకరు వుండరు. వీళ్ల సినిమాల శాటిలైట్ పెరగడినికి కూడా మా టీవీని బాగా వాడుకున్నారని టాలీవుడ్ టాక్. అలాంటిది ఇప్పుడు మా టీవీ చేతులు మారింది. స్టార్ చేతికి వెళ్లింది. అయితే నిర్వహణ పగ్గాలు ఇంకా వీరి చేతిలోనే వున్నాయి కాబట్టి, పని నడుస్తోంది. 

ఇదిలా వుంటే మెగా క్యాంప్ కు మాత్రం మెలమెల్లగా మా టీవీ దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. శాటిలైట్ లు ఇతర విషయాల్లో మా టీవీ ప్లేస్ ను జెమిని టీవీ ఆక్యుపై చేస్తున్నట్లుంది. రామ్ చరణ్ తాజా సినిమా హక్కులు కూడా ముందు మా టీవీ అని, ఆ తరువాత పై నుంచి పర్మిషన్ రాలేదని, ఆఖరికి జీటీవీకి వెళ్లాయి. పైగా నిన్న మెగాస్టార్ అభిమానులు తమ హీరో పుట్టిన రోజు వేడుకలు తలా కాస్త వేసుకుని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఆ కార్యక్రమం లైవ్ ప్రసారం చేయడానికి మా టీవీ ముందుకు రాలేదని వినికిడి. 

దాంతో వాళ్ల జెమిని ని అప్రోచ్ అయ్యారు. చాలా వరకు ఖర్చులు వారు పెట్టుకుంటే, అప్పుడు జెమిని టెలికాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మరి కొన్నాళ్లు సాగి, పూర్తిగా పగ్గాలు స్టార్ చేతిలోకి వెళితే, అప్పుడు మా టీవీ ఫంక్షన్లలో రెండు ఫ్యామిలీల ముఖాలు కాకుండా, కాస్త కొత్త ముఖాలు కనిపిస్తాయేమో?