Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా కజిన్స్ కు పవన్ రికమెండేషన్?

మెగా కజిన్స్ కు పవన్ రికమెండేషన్?

ప్రేమమ్ సినిమాతో రెండో హిట్ కొట్టాడు చందు మొండేటి. తన మూడో సినిమాను ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డితో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అనౌన్స్ మెంట్ కూడా చేసేసారు. అయితే హీరో ఎవరు అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.

అయితే ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరోలు ఇద్దరిలో ఎవరితో ఒకరితో చేయమని నిర్మాతకు రికమెండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐ డ్రీమ్ మీడియా అధినేతకు మెగా కాంపౌండ్ తో మంచి సంబంధాలు వున్నట్లు వినికిడి. అందుకే పవన్ అయితే సాయిధరమ్ తో లేదా వరుణ్ తేజతో కానీ సినిమా చేయమని సూచించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చందు దగ్గర వున్న ఓ సబ్జెక్ట్ మాంచి మాస్ ఎంటర్ టైనర్. అందువల్ల ఇది సాయి ధరమ్ కు సరిపోయే అవకాశం వుంది. పవన్ మాట మన్నించక తప్పని సరైతే, చందు తరువాతి సినిమాలో సాయి ధరమ్ నే హీరో కావచ్చు.

ఇదిలా వుంటే ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలు తీసి, ఇటీవల కాస్త పక్కన పడిన ఓ నిర్మాతకు కూడా పవన్ ఇటీవల సాయి ధరమ్ తో సినిమా చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.

అంటే మొత్తం మీద పవన్ యంగ్ మెగా హీరోలను బాగానే ప్రమోట్ చేయాలని చూస్తున్నట్లుంది. అయితే ఇదంతా వారి మీద ప్రేమతోనేనా? ఎవరికైనా మంచి పోటీగా ఈ మెగా కజిన్స్ ను తయారుచేయాలనుకుంటున్నారా? అన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?