చిరు కోడలు ఉపాసన నెంబర్ వన్ మేనేజ్ మెంట్ గురు. అందుకే ఇప్పుడు మెగా ఫంక్షన్లు ఏవి అయినా ఆమెదే సారథ్యం అంతా. చిరు షష్టి పూర్తి ఫంక్షన్ అద్భుతంగా ఎరేంజ్ చేసి మార్కులు కొట్టేసారామె. ఇప్పుడు ఆడపడుచు శ్రీజ పెళ్లి, రిసెప్షన్ వ్యవహారాలు కూడా ఆమే చూసినట్లు వినికిడి. అయితే దీని మీద కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రిసెప్షన్ కు సినిమా రంగంలోని చాలా మంది సెల్రబిటీలకు ఆహ్వానాలు అందలేదని అంటున్నారు. ముఖ్యంగా పలువురు పాపులర్ దర్శకులకు అందునా మెగా క్యాంప్ తో సంబంధాలు, పరిచయాలు వున్న వారికి ఆహ్వానాలు పంపలేదని తెలుస్తోంది. సాధారణంగా చిరు ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఏమయినా ఫిక్స్ డ్ జాబితా రెడీగా వుంటుందని, మరి ఆ జాబితాలోంచి కొన్ని పేర్లు డిలీట్ చేసారా? లేదా ఆహ్వానాలు పంపడంలో ఏదయినా పొరపాటు జరిగిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆహ్వానాలు అందని ఒకరిద్దరు దర్శకులు తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ఈ వైనం ప్రస్తావించారట. అహ్వానాలు రాలేదని చెప్పడం కన్నా, పనుండి వెళ్లలేదని చెప్పడం బెటర్ అని ఫిక్సయినట్లు వినికిడి.
ఇదిలా వుంటే శ్రీజ పెళ్లి ముందు చాల సైలెంట్ గా వుంచారు. వెన్యూ ఫిక్సేషన్ వరకు అన్నీ వీలయినంత లో ప్రొఫైల్ లో చేసారు. కానీ అంతకు ముందు ఇంట్లో జరిగిన ఫొటోలు అన్నీ ఒక్కొటి కావాలని మీడియాకు లీక్ చేసినట్లు పంపారు. అయితే పెళ్లి వేళకు వచ్చేసరికి స్ట్రాటజీ మార్చారు. ఫొటోలు ఎప్పటికప్పుడు మీడియాకు అందే ఏర్పాటు చేసారు. విడియోలు పంపారు. రిసెప్షన్ వ్వవహారం కూడా ఇంతే.
ఇదంతా చూసి అభిమానులు,సినిమాకు హైప్ తెచ్చినట్లు పెళ్లికి కూడా ఇంత హడావుడి అవసరమా అని గుసగుసలు పోతున్నారు. ఇతరుల దగ్గర ఏమీ మాట్లాడకున్నా, అభిమానులు వారిలో వారు మాత్రం ఈ హడావుడి అంతా ఎందుకు? గతంలో ఎప్పుడు చిరు ఇలా చేయలేదు అని అనుకుంటున్నారు. ఇదంతా ఉపాసన చేసిన ప్లానింగ్ అని వారిలో వారు చర్చించుకుంటున్నారు.