Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం..దిల్ రాజు

పాపం..దిల్ రాజు

సరైన పెద్ద సినిమా ఒకటి చేయాలని కిందా మీదా అవతున్నారు నిర్మాత దిల్ రాజు. కానీ ఏ హీరో కూడా దొరకడం లేదు. సరే రవితేజతో చేద్దామనుకుంటే, రేటు దగ్గర తేడా వచ్చింది. అదే కథను నాగ్ కు చెప్పాలనుకుంటే, అక్కడా బెడిసి కొట్టిందని వినికిడి. దీనికి సంబంధించి వినిపిస్తున్న కథనం ఆసక్తిగానే వుంది.

కథ వింటారా..దర్శకుడు వేణ్ శ్రీరామ్ ను పంపిస్తాను అని దిల్ రాజు అడిగితే, నాగ్...అసలు రవితేజతో ఎందుకు డ్రాప్ అయ్యారని ఆరా తీసాడట. రేటు ఎక్కువని ఆగిపోయారని తెలుసుకుని, తానేమైనా రవితేజ కన్నా తక్కువ కు వస్తా అనుకుంటున్నారా..అని ప్రశ్నించి, కథ వినడం వాయిదా వేసాడట. 

గతంలో గగనం టైమ్ లో కూడా నాగ్ కు దిల్ రాజుతో చిన్న బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ వున్నట్లు వదంతులు వున్నాయి. అసలే మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో నాగ్ ఫుల్ స్వింగ్ మీద వున్నాడు. అందువల్ల ఇప్పుడప్పుడే చిన్నా చితకా సినిమాలు చేయాలనుకోవడం లేదు.  కాస్త సరైన డైరక్టర్ తోనే చేయాలనుకుంటున్నాడు. అందుకే వేణు శ్రీరామ్ కథను వినడానికి ఆసక్తి కనబర్చలేదని వినికిడి.

ఇదిలా వుంటే మరే హీరో అందుబాటులో లేక, తమిళ హీరో విజయ్ డేట్లు ఇస్తే, బై లింగ్యువల్ చేయాలనే ఆలోచనలో వున్నాడట దిల్ రాజు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?